కింగ్ అక్కినేని నాగార్జునని ఇక మీదట భాయ్ అని పిలవాలేమో అంటున్నారు టాలీవుడ్ వాసులు. ఎందుకంటే.. 'పూలరంగడు' ఫేం వీరభద్రం చౌదరి తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నాగార్జునతో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. 'భాయ్' పేరుతో ఆయన రూపొందించుకున్న కథ నాగార్జునకు నచ్చడం, ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇంతకు ముందే జరిగాయి. మొదట్లో ఈ చిత్రాన్ని నిర్మాత ఎమ్మెల్ కుమార్ చౌదరికి చేయాలని నాగార్జున అనుకున్నారు. అయితే, కుమార్ చౌదరి ఇటీవల నిర్మించిన
'అధినాయకుడు' చిత్రం ఆర్ధిక ఇబ్బందుల్లో పడి, విడుదల విషయంలో పలు సమస్యలు ఎదుర్కోవడంతో, ఇప్పుడీ చిత్రాన్ని నాగార్జునే స్వయంగా నిర్మించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర నిర్మాణాన్ని నాగార్జున ప్రారంభిస్తారట! ఇదిలా ఉండగా, యువ సామ్రాట్ నాగార్జున హీరోగా కుటుంబ కథా చిత్రాల దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ లవ్ స్టొరీ ‘. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున కొత్త లుక్ తో కనిపించనున్నారు. ఇటీవలే సైబరాబాద్లో నాగార్జున మరియు మీరా చోప్రా మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి బాగా పరిచయమున్న అనిల్ బండారి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. కామాక్షి మూవీస్ బ్యానర్ ఫై శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దశరథ్-నాగార్జున కలయికలో వచ్చిన ‘సంతోషం’ మంచి విజయాన్ని సాదించింది, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంభినేషన్లో వస్తున్న ఈ చిత్రం కూడా అంతటి విజయం అందిస్తుందేమో వేచి చూడాలి. కామాక్షి మూవీస్ బ్యానర్ ఫై శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
...avnk