దర్శకుడు రాజమౌళితో పనిచేయడానికి అగ్రకథానాయకులు ఎప్పుడూ ఉత్సాహం చూపుతారు. ఈ నేపథ్యంలో తమిళ కథానాయకుడు
సూర్య కూడా ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. రాజమౌళి కూడా సూర్యాతో చేయడానికి మొగ్గు చూపుతున్నాడట. దాంతో, వీరిద్దర్నీ కలిపి, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో భారీ ద్విభాషా చిత్రంగా నిర్మించే బాధ్యతను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తీసుకుంటున్నట్టు ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన హీరో సూర్యాతో మాట్లాడినట్టూ, ఈ చిత్రానికి ఎన్ని డేట్స్ కావాలన్నా ఇస్తానని ఆయన చెప్పినట్టూ తెలుస్తోంది. దీనికి సంబంధించి దర్శకనిర్మాతలను కలిసి, చర్చించడానికి త్వరలో సూర్యా హైదరాబాదు వస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం కనిపిస్తోంది.
...avnk