సెల్ విప్లవం 3జి వేగానికి దారితీసిన ప్రస్తుత తరుణంలో తెరకెక్కుతున్న సినిమా '3జి లవ్'. 'ఫిబ్రవరి 14 రిలీజ్' అనేది ఉపశీర్షిక. వెంకటపతి దర్శకుడు. 30మంది కొత్తతారలను తెరకు పరిచయంచేస్తూ స్క్వేర్ ఇండియా స్టూడియోస్ సంస్థ రూపొందిస్తోంది.
రామానాయుడు స్టూడియోలో ముహూర్తపు సన్నివేశానికి ఆనంద్ క్లాప్ ఇవ్వగా, నీలకంఠ కెమేరా స్విచ్చాన్ చేశారు.
అనంతరం నీలకంఠ సినిమా గురించి వెల్లడించారు. ''టైటిల్ సహా కథాంశం పూర్తి ఊహాజనితం. దర్శకుడు నా శిష్యుడే. సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించడంలో దిట్ట. రిలీజ్ తేదీనే ఉపశీర్షికగా నిర్ణయించడం గ్రేట్'' అన్నారు. ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా రూపొందిస్తున్న చిత్రమని మరో అతిథిగా విచ్చేసిన దర్శకుడు త్రినాథరావు నక్కిన చెప్పారు. ఇంకా.. కాలేజీనేపథ్యంలో సాగేచిత్రమని చిత్రదర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ''మా బేనర్ పదవ వార్షికోత్సవ కానుక ఇది. ట్యాలెంట్‌హంట్ ద్వారా నటీనటులను ఎంపిక చేశాం. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళుతున్నాం. ప్రేమికులరోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలచేస్తాం'' అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, కథ, కథనం, దర్శకత్వం: వెంకటపతి.
...avnk