నందమూరి బాలకృష్ణ-వివి వినాయక్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందా? ‘చెన్నకేశవడ్డి’ కాంబినేషన్ రిపీటవుతుందనే టాక్
ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ‘చెన్నకేశవడ్డి’లో బాలకృష్ణని తండ్రీ కొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించిన వినాయక్ త్వరలో మరోసారి ఆయనతో ఓ భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వినాయక్ ఇటీవలే ఓ సబ్జెక్టుని బాలకృష్ణకు చెప్పాడని, స్టోరీ నచ్చడంతో బాలయ్య సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. ఇక ఈ సినిమాని శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. బాలయ్య వందవ చిత్రానికి సంబంధించి మరో సమాచారం అందుతోంది. ఇకపై నెలలో 15 రోజులు మాత్రమే సినిమాలకి కేటాయిస్తాననీ ... మిగతా 15 రోజులు పార్టీ పనులకి కేటాయిస్తానని బాలయ్య అంటున్న నేపథ్యంలోనే తన 100 వ చిత్రానికి 'NTR' (ఎన్టీఆర్) అనే టైటిల్ ని పెడుతున్నట్టు తెలుస్తోంది. 'ఎన్టీఆర్' అనే ఈ టైటిల్ కి 'న్యాయానికీ త్యాగానికి రారాజు' అనే క్యాప్షన్ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ని వీరి సొంత చిత్ర నిర్మాణ సంస్థ 'రామ కృష్ణా సినీ స్టూడియోస్' ఫిల్మ్ చాంబర్లో రిజిష్టర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం బాలయ్య రవికుమార్ చావలి దర్శకత్వంలో ‘శ్రీమన్నారాయణ’ చిత్రం చేస్తున్నాడు.
...avnk