సంచలన దర్శకుడు శంకర్ తాజాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఐ ’. ఈ చిత్రంలో అమీ జాక్సన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ
సినిమాకు ఆమె కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటోంది. కాగా, సినిమాకు ముందు సమంతను కథానాయికగా అనుకున్నారు. అయితే... సమంత ఆ ప్రాజెక్ట్ నుంచి గౌరవంగా తప్పుకోవడంతో చివరకు అమీ జాక్సన్ని ఆ పాత్ర వరించింది. ఇదిలావుంటే... ఈ సినిమా నుంచి సమంత తప్పుకోవడంలో ఏదో బలీయమైన కారణం ఉందని ఆ పాత్ర విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏదో ఉందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమీకి కోటి రూపాయలు ఇవ్వడానికి కారణం కూడా అదే అని కొందరి వాదన. కానీ అమీ జాక్సన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా శంకర్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. శంకర్ సార్ డైరెక్షన్‌లో నటంచబోతున్నాను అని తెలియగానే... ఓవర్ నైట్ నా స్టార్‌డమ్ పెరిగిపోయింది అంటూ మీడియా ముందు ఆనందం వ్యక్తం చేశారు అమీ. అందుకేనా పారితోషికం కోటి చేశారు? అనడిగితే- నా దృష్టిలో పాత్రను బట్టే పారితోషికం ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా సాహసాలు చేయాల్సివుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే నాకు కోటి పారితోషికం ఇచ్చారంటోంది ఈ అందాల బామ.
....avnk