అందాల భామ హన్సిక నటించిన కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్ మరియు హన్సిక ప్రధాన
పాత్రలలో తెరకెక్కిన చిత్రం “ఓకే ఓకే”. చిత్ర ఆడియో విడుదల హైదరాబాద్ నోవాటెల్ లో జరిగింది. ఎం రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయం సాదించింది తెలుగులో ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ అనువదిస్తున్నారు. ఉధయనిది స్టాలిన్, హన్సిక, హారిస్ జయరాజ్, సిద్దార్థ్, సునీల్, నాగ చైతన్య, నందిని రెడ్డి, డాలీ, మారుతీ మరియు వి వి వినాయక్ ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరయ్యారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో భారీ ఎత్తున విడుదల చెయ్యనున్నారు. నిన్న నే ఈ చిత్ర ట్రైలర్స్ విడుదలయ్యాయి.
...avnk