పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- పూరీ జగన్నాథ్ కలయికలో వస్తోన్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే టాకీ దాదాపు సగం వరకు పూరీ లాగించేశాడని అంటున్నారు. దాంతో పాటు ఓ ఐటెం సాంగు కూడా పూర్తి చేశాడు. హైదరాబాదు సారధీ స్టూడియోలో వేసిన సెట్ వర్క్ చాలా వరకు పూర్తయిందట. రేపటి (శుక్రవారం) నుంచి బంజారాహిల్స్ లోని TV9 ఆఫీసులో షూటింగు చేస్తారని సమాచారం. ఇందులో హీరో పవన్ కల్యాణ్ మెకానిక్ ఓనర్ గా జీవితాన్ని ప్రారంభించి... ఊహించని విధంగా టీవీ రిపోర్టర్ గా మారతాడని తెలుస్తోంది. హీరోయిన్ తమన్నా కెమెరావిమన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18 న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.
కాగా, పూరీ మరో చిత్రం 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరుకి విడుదల చేస్తామని నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ చెప్పారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ఇది ప్రేక్షకులని అలరించనున్నఈ మూవీలో ఇలియానా చాలా సెక్సీగా కనిపించబోతోందని తెలిసిందే.. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం షూటింగు అధిక భాగం బ్యాంకాక్ లో నిర్వహించిన సంగతి ఆడియో రిలీజ్ సమయంలో పూరీ వెల్లడించారు.
...avnk