చిత్రం నుంచి కెరీర్‌ను ఆరంభించి ఒకరేంజికు వెళ్లిన ఉదరుకిరణ్ ఆ తర్వాత కాలక్రమేణా మరుగు నపడిపోయారు. అయినా అడపాతడపా బాక్సాఫీస్ మీద దండెత్తుతూనే ఉన్నాడు. అయినా కాలం కలిసిరావటంలేదు.
ఇటీవలే తన కెరీర్‌ని మళ్లీ నిలబెట్టుకోవాలని చూస్తున్నాడీ హీరో. తను మళ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకోవడం సెల్‌షిఫ్ అవుతుందనీ, కానీ తనకు సంబంధం లేనివారు కూడా తాను బాగుండాలని కోరుకోవడం ఆనందంగా ఉందంటున్నాడు ఉదయ్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'జై శ్రీరామ్'.ఆ చిత్ర కథ నా కోసమే తెచ్చారని అంటున్నారు. ఈ చిత్రాన్ని రమేష్, రాజేష్ నిర్మిస్తున్నారు. వీరి స్నేహితుడు మల్టీడైమన్షన్ వాసు. ఈ వాసుగారే నా బాగుకోరి మంచి ఆఫర్ ఇచ్చారని ఈసందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అయితే గతంలో నేను 'శ్రీరామ్' చిత్రాన్ని చేశాను. మాస్ ఇమేజ్ చిత్రమిది. అంతా వీడికి ఇది అవసరమా? అన్నారు. అప్పటికిలవర్‌బారుగా వుండేవాడ్ని... అందుకే మళ్లీ ఆరాముడ్నే నమ్ముకోవాలని.. జైశ్రీరామ్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కన్పిస్తున్నాను అన్నారు. ఈ చిత్రంలో హీరో పాత్ర నాలుగు షేడ్స్‌లో వుంటుందని దర్శకుడు బాలాజీ ఎన్.సాయి వెల్లడించారు. ఈ సినిమా ద్వారానైనా ఉదయ్ కి మళ్లీ పూర్వవైభవం రావాలని మనమూ కోరుకుందాం...
...avnk