ధనుష్, శృతి హసన్ జంటగా నటించిన రాబోయే చిత్రం ’3′. ఇవాళే ఈ మూవీ సెన్సార్ బోర్డు నుంచి ‘యు’ సర్టిఫికేట్ పొందింది. దీనికి ఆ చిత్ర హీరో ధనుష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తొలిసారి దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. మార్చి 31న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.
చిత్ర ఆడియో ఇటీవలే తాజ్ డెక్కన్ హోటల్లో జరగింది. ‘కొలవేరి’ సంచలనం అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకకి మూవీ మొఘల్ రామానాయుడు, విజయేంద్ర ప్రసాద్, నటుడు రాజశేఖర్, జీవిత, శ్రీహరి, రానా, ధనుష్, ఐశ్వర్య, అనిరుద్, వీరభద్రమ్, నట్టి కుమార్ హాజరయ్యారు.
రామానాయుడు ఈ చిత్ర ఆడియోని విడుదల చేసి రాజేశేఖర్ కి ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ధనుష్ ఒకప్పుడు తమిళ్ హీరోగా మాత్రమే ఉండేవాడు. ఇప్పుడు ఈరోజు వరల్డ్ ఫేమస్ హీరో అయిపోయాడు. ఈ సినిమా కూడా అంత పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
...avnk