స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ఇలియానా జంటగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి మనకు తెలుసు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్-ఇలియానాల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని సమాచారం. సందర్భానికి అనుగుణంగా వచ్చే ఈ సీన్ కు ఇలి కూడా దీనికి ఓకే చెప్పిందట.
అర్జున్ ఇంతకు ముందు సినిమాలలో హీరోయిన్స్ తో లిప్ లాక్ సన్నివేశాలు తెరపై బాగా పండాయి. ఆర్య-2లో కాజల్ అగర్వాల్‌ను, వేదంలో దీక్షాసేథ్‌ను, 'వరుడు'లో భానుశ్రీ మెహ్రాని చాలాసేపు లిక్ లాప్ చేసిన అనుభవం అల్లు అర్జున్ సొంతం. పెళ్లయిన తర్వాత అల్లు అర్జున్ అటువంటి సీన్స్ ను దాదాపు తగ్గించాడు. అయితే ఈ తాజా చిత్రంలో లిప్ లాక్ ఉండితీరాల్సిందేనని త్రివిక్రమ్ పట్టుబడుతున్నాడట. సరే మరి ఇంకెందుకాలస్యం.
పంచ్ డైలాగ్స్ తో పూర్తి రొమాంటిక్ కామెడీ సినిమాగా తీయాలని త్రివిక్రమ్ భావిస్తోన్న ఈ చిత్రాన్ని ఎన్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రకరకాల పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే, 'హనీ' అనే టైటిల్ ఛాంబర్‌లో రిజిష్టర్ అయింది. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత దిల్‌రాజు నిర్మించే చిత్రంలో అల్లుఅర్జున్ నటిస్తున్నాడు
...avnk