dead body in Hero Nagarjun Akkineni farm land హీరో నాగార్జున ఫామ్ హౌజ్ లో అస్తిపంజరం..!

Skeletal remains of body found in actor nagarjuna s farmhouse

Nagarjuna Akkineni, Amala Akkineni, farmhouse, Skeletal remains, dead body, Papireddyguda, Rangareddy, nagarjuna akkineni twitter, nagarjuna akkineni instagram, nagarjuna akkineni dead body, nagarjuna akkineni dead body agriculture land, telugu cinema, Telangana, Crime

A highly decomposed body of an unidentified person was found in the premises of popular actor Akkineni Nagarjuna's farmhouse in Papireddyguda in Telangana's Rangareddy district

హీరో నాగార్జున ఫామ్ హౌజ్ లో అస్తిపంజరం..!

Posted: 09/19/2019 12:01 PM IST
Skeletal remains of body found in actor nagarjuna s farmhouse

హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం కలకలం రేపుతుంది. షాద్ నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని నాగార్జున వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహాం లభ్యమైంది. అది కూడా పూర్తిగా కుళ్ళిపోయి.. ఎముకల గూడులా ఉండటం సంచలనాలకు తావిస్తుంది. పాపిరెడ్డిగూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసాడు నాగార్జున. అయితే అప్పటి నుంచి దానిని అలాగే వుంచిన నాగార్జున.. ఈ నెల 10న తన భార్య అమలతో కలసి తన వ్యవసాయ కేత్రానికి వెళ్లాడు.

అమెతో పాటుగా అతను కూడా అక్కడ  పలు రకాల మొక్కలు నాటాడు. వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఇదే విషయంపై వ్యవసాయ సాగు కోసం తన పొలానికి నిపుణులను అహ్వానించాడు నాగార్జున. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని నిపుణులు గుర్తించారు. ఈ విషయమై వారు వెంటనే పోలీసులతో పాటు హీరో నాగార్జునకు కూడా సమాచారం అందించారు.

పూర్తిగా కుళ్లిపోయి ఎముకల గూడుగా మారిన మృతదేహానికి అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఆ శవం దొరికిన గదిని సీజ్ చేశారు. ఇవాళ అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. స్థానికులు, నిపుణుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  farmhouse  dead body  Papireddyguda  Rangareddy  Telangana  Crime  

Other Articles