Sye Raa pre-release event postponed ‘సైరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మళ్లీ వాయిదా

Chiranjeevi s sye raa pre release event postponed

Chiranjeevi, Amitabh Bachchan, Sye Raa Narasimha Reddy, Susmitha, precious gift, Excel Entertainment, Farhan Akhtar, Kiccha Sudeep, Pawan Kalyan, Ram Charan, South Indian Movies, SouthIndianMovies, Telugu cinema, Vijay Sethupathi movies, Entertainment, Tollywood

Tollywood megastar chiranjeevi's Sye Raa Narasimha Reddy movie pre-release event postponed due to rain forecast on 18th september, to be organised on 22nd September at Hyderbad Lal Bahadur Statium.

చిరంజీవి ‘సైరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మళ్లీ వాయిదా

Posted: 09/17/2019 05:17 PM IST
Chiranjeevi s sye raa pre release event postponed

తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపోందిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం వచ్చే నెల 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదల కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 18న చిత్రానికి సంబంధించిన ట్రైయిలర్ విడుదలకు చిత్ర నిర్మాణ యూనిట్ ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. అయితే అంతకన్నా ముందుగానే చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరపాలని చూసినా.. వరుణుడు అందుకు అనుకూలించలేదు.

ఇదివరకే కర్నూలులో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయగా, వర్షాన్ని కురిపిస్తాడని తెలిసి వాయిదా వేశారు. ఆ తరువాత ఈ నెల 18న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఇక్కడా వరుణుడు అడ్డుకోజూస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుకున్న కొణిదెల ప్రోడక్షన్స్ కంపెనీ హైదరబాద్ లోనూ ప్రీరిలీజ్ ఈవెంట్ను వాయిదా వేసుకుంది. ఈ మేరకు ఇవాళ ట్వీట్ చేసింది.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను వాయిదాకు గల కారణాన్ని తాజాగా చిత్ర యూనిట్ వివరించింది. 18వ తేదీ హైదరాబాద్ లో వాతావరణం అనుకూలంగా ఉండదని రిపోర్ట్స్ రావడంతో వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రీరిలీజ్ వేడుకని సెప్టెంబర్ 22న నిర్వహించబోతున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు. అయితే ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం 18నే ట్రయిలర్ ను విడుదల చేయనున్నారు.

ఉయ్యాలవాడ నరసింహారడ్డిగా చిరంజీవి.. ఆయన సతీమణిగా సిద్ధమ్మ పాత్రలో నయనతార.. గురువు వెంకన్న పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. ఇంకా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్, తమన్నా కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా జనసేనాని పవన్ కళ్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ హాజరు కానుండడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Amitabh Bachchan  Sye Raa Narasimha Reddy  Susmitha  precious gift  tollywood  

Other Articles