Vijay Deverakonda joins the Save 'Nallamala' విజయ్ దేవరకొండ ‘జనతా గ్యారేజ్’ సూచన

Vijay devarakonda joins pawan kalyan to save nallamala campaign forest

Vijay Devarakonda,Vijay Deverakonda,Pawan Kalyan,Save Nallamala campaign,Pawan Kalyan Save Nallamala campaign,Vijay Deverakonda Save Nallamala campaign,Telugu celebs join Save Nallamala campaign,uranium mining in Nallamala forest, Tollywood, Movies, Entertainment

After Pawan Kalyan, Vijay Devarakonda is the next celeb from the film industry to join 'Save Nallamala' campaign. He says that the uranium mining will destroy 20,000 acres of the Nallamala forest.

విజయ్ దేవరకొండ ‘జనతా గ్యారేజ్’ సూచన

Posted: 09/12/2019 04:31 PM IST
Vijay devarakonda joins pawan kalyan to save nallamala campaign forest

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై టాలీవుడ్‌ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తనదైన శైలిలో స్పందించారు. ‘‘యురేనియం కొనొచ్చు.. కానీ అడవులను కొనగలమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసే ధోరణిలో ట్వీట్ చేశారు. ‘యురేనియం తవ్వకాలతో నల్లమలలోని కొన్ని వేల ఎకరాల అటవీ ప్రాంతం ధ్వంసం కానుంది. మనం సరస్సులను నాశనం చేసుకున్నామని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

‘‘సహజ వనరులను నాశనం చేయడంతో కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టిని చూశాం. తాగునీటి వనరులు కూడా కలుషితం అయ్యాయి. ఎక్కడా స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. చాలా నగరాల్లో నీరు సరిగ్గా దొరకడం లేదు. కానీ మనం మాత్రం ఇంకా మిగిలి ఉన్న ఆ కొన్ని సహజ వనరులను కూడా నాశనం చేసేందుకు పథకాలు వేస్తున్నాం. తాజాగా నల్లమలను నాశనం చేసే పనిలో పడ్డాం. ఇది సముచితం కాదని పేర్కోన్నారు.

‘‘యురేనియం కావాలనుకుంటే కొనుకోండి. యురేనియం కొనుకోవచ్చు.. కానీ అడవులను కొనొచ్చా..? పీల్చడానికి గాలి.. తాగడానికి నీరు లేనప్పుడు యురేనియం, విద్యుత్‌ శక్తితో ఏం చేసుకుంటాం.’ అని విజయ్‌ దేవరకొండ ప్రశ్నించారు. నల్లమలలోని యురేనియం తవ్వకాల వల్ల తెలుగు రాష్ట్రాలకు ముప్పు వాటిల్లుతుందని.. కృష్ణాజలాలు సైతం కలుషితమవుతాయని ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోషల్‌మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Devarakonda  Pawan Kalyan  Save Nallamala  Uranium  Tollywood  

Other Articles