Dhanush looks fierce in Asuran హ్యాట్రిక్ కాంబినేషన్: ‘అసురన్’ ట్రైలర్ విడుదల..

Dhanush takes off on a fierce revenge battle in asuran trailer

Asuran, Asuran Trailer, Dhanush, Vetri Maaran, G. V. Prakash Kumar, Kalaippuli S Thanu, Asuran trailer launch, Asuran trailer out, Dhanush, Vetri Maaran, Manju Warrier, Asuran release, Asuran release date, Dhanush two roles, kollywood celebrities, Kollywood, movies, entertainment, tollywood

The trailer of Asuran has been released today and it is raw, intense and intriguing at the same time. As reported earlier, Dhanush plays two roles - as that of a father and son- in the film.

హ్యాట్రిక్ కాంబినేషన్: ‘అసురన్’ ట్రైలర్ విడుదల..

Posted: 09/09/2019 12:13 PM IST
Dhanush takes off on a fierce revenge battle in asuran trailer

ధనుష్‌ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘అసురన్‌’. వెట్రి మారన్‌ దర్శకత్వం వహించారు. వెట్రి మారన్ గతంలో ధనుష్‌ తో 'పొల్లాదవన్', 'ఆడుకళమ్' అనే సినిమాలు తీశారు. 'ఆడుకళమ్' సినిమాకు ధనుష్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత వీరి కాంబీనేషన్‌లో వచ్చిన మరో సినిమా 'వడచెన్నై'. ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో అదే కాంబినేషన్ ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంపై గురిపెట్టింది.

ఈసారి వీరిద్దరి కాంబీనేషన్‌లో వస్తున్న సినిమా 'అసురన్'. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అసురన్ ట్రైలర్‌లో ధనుష్‌ తన నటనతో దుమ్మురేపారు. ట్రైలర్‌లో ధనుష్.. మాస్ లుక్‌లో అదరగొట్టాడు. సినిమా గ్రామీణ నేపథ్యంలో.. రెండు వర్గాల మధ్య సాగుతూ.. వ్యక్తిగత కక్ష్యలు,  భూమికోసం పోరాటం చేస్తున్నట్లు ధనుష్ కనిపించాడు. కాగా ధనుష్ ఈ సినిమాపై భారీ అశలనే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే ఆయనకు నిర్మాతకు మధ్య నలుగుతున్న వివాదం కూడా ఓ కొలిక్కి రానుందని టాక్ వినబడుతుంది.

అయితే ఇక్కడ విశేశమేమంటే ధనుష్ ఈ సినిమాలో ద్వితీయాభినయం చేయనున్నాడు. అంటే డబుల్ యాక్షన్ లో కనిపించనున్నారు. అసురన్.. అక్టోబరు 4న విడుదల కాబోతోంది. అసురన్..లో ధనుష్‌తో పాటు ముఖ్య పాత్రల్లో మంజు వారియర్‌, ప్రకాశ్‌రాజ్‌, అభిరమి నటిస్తున్నారు. ఈ సినిమాను కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తుండగా.. జి.వి ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా  ఇంతకు ముందు ధనుష్‌ ‘మారి 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అది బాక్సాఫీసు వద్ద అంతగా కాసులను రాల్చలేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asuran  Asuran Trailer  Dhanush  Vetri Maaran  G. V. Prakash Kumar  Kalaippuli S Thanu  Kollywood  

Other Articles