big b, rajani, mohanlal, yash voice over for sye raa ‘సైరా’ కోసం రంగంలోకి పంచ పాండవులు

Big b rajani mohanlal yash voice over for chiranjeevi s sye raa

sye raa, amitabh bachchan, Chiranjeevi, Nayanthara, pawan kalyan, Rajinikanth, Mohanlal, Yash, Ram Charan, surender reddy, sye raa narasimha reddy, Malluwood, tollywood, bollywood, Kollywood, sandalwood, movies, entertainment

Ram Charan brings bollywood big b amitabh bachchan, south indian top actors rajini kanth from kollywood, yash from sandalwood, mohanlal from malluwood for voice over in various languages for his film sye raa narasimha reddy.

‘సైరా’ కోసం పంచ పాండవులను రంగంలోకి దింపిన రాంచరణ్

Posted: 08/19/2019 06:52 PM IST
Big b rajani mohanlal yash voice over for chiranjeevi s sye raa

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్మాణవర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్ర గోసాయి వెంకన్న పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు. దీంతో ఈ సినిమాకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది.

మరోవైపు దక్షిణభారతం లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. మరోవైపు తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఏకకాలంలో  రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో క్రేజ్ తీసుకువచ్చేందకు ఇప్పటికే ఆయా భాషలకు చెందిన నటీనటులను ఈ సినిమాలో తీసుకున్నారు.

కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్ ఏర్పాటుతో నిర్మాతగా మారిన రాంచరణ్ తన తండ్రి హీరోగా రెండో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఏకంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం అమితాబ్ బచ్చన్ నుంచి దక్షిణ భారతంలోని నాలుగు బాషాల్లోని నలుగురు అగ్రనటులను ఎంపిక చేసుకుని వారితో వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారు చెర్రీ. తమిళనంలో రజనీకాంత్ ఆ బాధ్యతను తీసుకునేందుకు అంగీకారం తెలుపుగా, కన్నడంలో యష్, మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో పవన్ కల్యాణ్ ఈ కార్యాన్ని సమకూర్చుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sye raa  chiranjeevi  Big B  Mohanlal  RajaniKanth  Yash  tollywood  

Other Articles