Allu Arjun Praises Venkat Ramji’s Evaru! ఎవరు చిత్రం నాకు బాగా నచ్చింది: అల్లు అర్జున్ ప్రశంస

South superstar allu arjun is all praises for venkat ramji s evaru

Allu Arjun, Evaru, Adivi sesh, Regina Cassandra, Naveen chandra, Murli sharma, Venkat ram, latest movie news, tollywood, movies, entertainment

Filmmaker Venkat Ramji’s directorial venture, Evaru, has been garnering all praises and applauds from the cine-goers. South heartthrob Allu Arjun took on twitter to congratulate the team of Evaru, as he was mighty impressed with the film.

ఎవరు చిత్రం నాకు బాగా నచ్చింది: అల్లు అర్జున్ ప్రశంస

Posted: 08/19/2019 04:27 PM IST
South superstar allu arjun is all praises for venkat ramji s evaru

సామాజిక సేవతో పాటు మానవత్వంతో స్పందించడంలోనూ మన హీరోలు తమకు తామే సాటి అనిపించుకుంటున్నారు. ఇదే సమయంలో టేకింగ్, కథ, కథనం, ఇత్యాదులు బాగుంటే ఒకరి సినిమాలను మరోకరు ఎలాంటి బేషజాలు లేకుండా ప్రశంసిస్తూ.. కొత్త ట్రెండ్ కు కారణం అవుతున్నారు. ఈ తరహా సంస్కృతి ఇప్పుడోస్తున్న హీరోల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు కారణం వారంత ఫ్రెండ్లీగా ఉండటం కూడా కారణమేనే చెప్పాలి. ఎవరి సినిమానైనా బాగుంటే.. సోషల్ మీడియా వేదికగా మిగతా హీరోలు మెచ్చుకుంటున్నారు.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అడివి శేష్ హీరోగా నటించిన ‘ఎవరు’ సినిమాను మెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అడివి శేష్.. తాజాగా ‘ఎవరు’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకాధరణ పోందడంతో బాక్సాఫీసు వద్ద కూడా బాగానే సవ్వడి చేస్తోంది. దీంతో అడివి శేష్.. వరుసగా మూడు విజయాన్ని తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ కొట్టాడు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. ‘‘ ఆదివారం రాత్రి ఈ సినిమా చూసాను. ప్రతి సీన్ అద్భుతంగా ఉంది. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఉన్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అద్భుతమైన కథను ఎంపిక చేసుకున్న అడివి శేష్ నటన బాగుంది. ‘ఎవరు’ సినిమాతో అడివి శేష్ హీరోగా హాట్రిక్ హిట్ అందుకున్నాడు. నటీనటులు రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ, అందరూ బాగా నటించారు. పివీపి గారికి శుభాకాంక్షలు, ఇక చిత్ర యూనిట్ కెప్టెన్ దర్శకుడు వెంకట్ రామ్‌జీ కూడా శుభాకాంక్షలు అని బన్నీ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Evaru  Adivi sesh  Regina Cassandra  Naveen chandra  Murli sharma  Venkat ram  tollywood  

Other Articles

Today on Telugu Wishesh