Rashmika follows footsteps of Anushka అనుష్కను ఫాలో అవుతున్న రష్మిక..

Rashmika mandanna follows footsteps of anushka shetty

prabhas anushka relationship, prabhas anushka dating, prabhas anushka friendship, vijay devarakonda rashmika relationship, vijay devarakonda rashmika dating, vijay devarakonda rashmika friendship, Prabhas, vijay devarakonda, anushka shetty, rashmika mandanna, friendship, Tollywood

Rashmika Mandanna has clarified her stand on her relationship with Vijay. she said that her relationship with Vijay is nothing more than just friendship, after the news of their dating goes viral on social media.

బాహుబలి బ్యూటీని ఫాలో అవుతున్న రష్మిక..

Posted: 08/17/2019 11:21 PM IST
Rashmika mandanna follows footsteps of anushka shetty

‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన, ఆ తరువాత తన బాయ్ ఫ్రెండ్ తో నిష్కితార్థాన్ని కూడా పలు కారణాలతో వదులుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పక్కనబెడితే అమె ప్రస్తుతం దక్షిణాది అగ్రనటిగా వెలుగొంది అటు బాలీవుడ్ లోనూ బాహుబలి చిత్రంలో తన సత్తాను చాటిన అనుష్కను ఫాలోఅవుతోందన్న టాక్ వినిపిస్తోంది. చిత్రసీమలో అగ్రతారలను కొత్తగా ఎంట్రీఇచ్చిన వారు ఫాలో కావడం కామనే కదా అంటారా.?.

అయితే నటన, డైలాగ్ డెలివరీ, హావభావాలను వ్యక్తం చేసే విషయంలో ఫాలో అయితే పర్వాలేదు కానీ.. ఏకంగా వ్యక్తిగత వ్యవహారం విషయంలో ఫాలో అవితే.. అది చర్యనీయాంశమేగా మరీ. ప్రభాస్ తో అనుష్క ప్రేమాయణం నడుపుతోందన్న వార్తల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన అనుష్క.. సారీ మా ఇద్దరి మధ్య వున్నది స్నేహం మాత్రమే. దానికి అపార్థాలను జోడించకండీ అని మనవి చేసింది. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక కూడా అదే విషయాన్ని మీడియాకు చెప్పింది. ఎందుకంటారా.?

రష్మిక మందన, యూత్ లో యమక్రేజ్ సంపాదించిన నటుడు విజయ్‌ దేవరకోండతో తెలుగుతెరపై అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరు గీతాగోవిందం తరువాత తాజాగా భరత్‌ కమ్మ దర్శకత్వంలో జంటగా నటించిన సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ చిత్రం మొదలైన దగ్గరి నుంచి విజయ్‌ దేవరకొండ, రష్మిక డేటింగ్‌లో ఉన్నారని వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలుసుకోవాలని ఫ్యాన్స్‌ ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్‌తో బంధం గురించి తాజాగా రష్మిక మాట్లాడారు. విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అని ప్రశ్నించగా.. ‘అతడు నాకు కేవలం స్నేహితుడు మాత్రమే.. దానికి మించి ఏమీలేదు’ అని బదులిచ్చారు. అచ్చం ఇలాగే గతంలో అనుష్క కూడా మీడియాకు చెప్పడంతో.. వారు రష్మిక కూడా అనుష్కను ఫాలో అవుతోందని.. ఈ ఇద్దరు కన్నడ బామలు తెలుగు హీరోలతో మంచి స్నేహం చేసుకున్నారని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక మహేష్ సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తుస్తున్నారు. మరోవైపు రష్మిక, కార్తి జోడీగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించేందుకు విజయ్‌ ఇటీవల పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  vijay devarakonda  anushka shetty  rashmika mandanna  friendship  Tollywood  

Other Articles