HBD Hansika: Posters From Tenali Ramakrishna BABL ‘తెనాలి రామకృష్ణ’ బ్యూటీకి జన్మదిన శుభాకాంక్షలు..

Hansika birthday wishes posters from tenali ramakrishna babl movie team

Tenali ramakrishna, Hansika, Sandeep Kishan, varalaxmi sarath kumear, Emtertainment, movies, Tollywood

Blessed with a vivacious personality, cherubic looks, effervescent smile and oodles of acting prowess, Hansika Motwani has been enjoying her birthday today.

‘తెనాలి రామకృష్ణ’ బ్యూటీకి జన్మదిన శుభాకాంక్షలు..

Posted: 08/09/2019 07:02 PM IST
Hansika birthday wishes posters from tenali ramakrishna babl movie team

ఇటు దక్షిణాన తన సత్తా చాటుతూనే అటు బాలీవుడ్ లోనూ తన హావాను కొనసాగిస్తున్న హన్సిక చాలా రోజుల తర్వాత తెలుగులో నేరుగా నటిస్తున్న చిత్రం ‘తెనాలి రామకృష్ణుడు బి.ఎ. బీఎల్‌‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ఉప శీర్షిక. సందీప్‌ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇవాళ హన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాలోని హన్సిక లుక్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో హన్సిక చాలా స్టైల్‌గా కనిపించారు.

సినిమాలో హన్సిక లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. మరో కథానాయిక, తమిళ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాటలు మినహా చిత్రీకరణ దాదాపు పూర్తైంది. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tenali ramakrishna  Hansika  Sandeep Kishan  varalaxmi sarath kumear  Tollywood  

Other Articles