Devadas Kanakala passes away టాలీవుడ్ లో మారో విషాదం.. దేవదాస్ కనకాల కన్నుమూత..

Senior actor devadas kanakala passes away at 74

Devdas Kanakala, Devdas Kanakala no more, Devdas Kanakala passes away, acting institiute, Suma, Rajv Kanakala, condolence, KIMS, Tollywood, movies, entertainment, tollywood

Well-known character artiste Devadas Kanakala, 74, passed away at a city hospital. The actor, who was reportedly unwell for some time.

టాలీవుడ్ లో మారో విషాదం.. దేవదాస్ కనకాల కన్నుమూత..

Posted: 08/02/2019 07:21 PM IST
Senior actor devadas kanakala passes away at 74

తెలుగు పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తన సతీమణి లక్ష్మీ పరపమదించి ఏడాది కూడా గడవకముందే ఆయన కూడా అనారోగ్యం బారిన పడి మరణించడం టాలీవుడ్ లోని ప్రముఖుల్ని శోకసంద్రంలో ముంచింది. తన భార్యపై దిగులుతోనే ఆయన కూడా అనారోగ్యం బారిన పడ్డారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాల టాలీవుడ్ లో పేరున్న నటుడు కాగా, ఆయన కోడలు సుమ అగ్రశ్రేణి యాంకర్ గా పేరుతెచ్చుకున్నారు. 1945 యానాంలో జన్మించిన దేవదాస్ కనకాల నటుడిగానే కాకుండా, నటనా శిక్షకుడిగా సైతం ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన అర్ధాంగితో కలిసి యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ పెట్టి అనేకమందిని చిత్ర పరిశ్రమకు అందించారు. నటుడిగా సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

దేవదాస్ కనకాల చివరగా నటించింది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను'లో.. ఈ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా దేవదాస్ కనకాల మృతి పట్ల తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. అగ్రహీరో చిరంజీవి నుంచి ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటులు, జూనియర్ ఆర్టిస్టులు, ఇలా చిత్రసీమతో అనుబంధమున్న అనేకమంది దేవదాస్ కనకాలకు తమ సంతాపాన్ని తెలిపారు. పలువురు నటులు రాజీవ్ కనకాలకు, సుమ సహా కుటుంబసభ్యులకు తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

దేవదాస్ కనకాల మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేవదాస్ కనకాల తాను నటుడిగా రాణించడమే కాకుండా, ఎంతోమందిని ఉత్తమ నటులుగా తీర్చిదిద్ది చిత్ర పరిశ్రమకు అందించారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన మరణం కళారంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో దేవదాస్ కనకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devdas Kanakala  acting institiute  Suma  Rajv Kanakala  condolence  KIMS  Tollywood  

Other Articles