Chiranjeevi's surprise for Aishwarya Rajesh! మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

Chiranjeevi s surprise for aishwarya rajesh

Chiranjeevi, Aishwarya Rajesh, Sivakarthikeyan, Dhibu Ninan Thomas, K.A.Vallabha, Bheemaneni SrinivasaRao, tollywood, movies, entertainment, tollywood

Actress Aishwarya Rajesh has revealed that she received a surprise call from the Tollywood megastar Chiranjeevi, praising the teaser, and expressed it to be a great honour.

మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

Posted: 06/18/2019 05:05 PM IST
Chiranjeevi s surprise for aishwarya rajesh

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్ గా అద్భుతంగా నటించిందని కితాబిచ్చారు. సినిమాలో క్రికెటర్ పాత్ర కోసం ఆమె నాలుగు నెలల పాటు క్రికెట్ నేర్చుకుని సెట్స్ మీదకు రావడం ఆమె అంకితభావానికి నిదర్శనం అని మెచ్చుకున్నారు. ఐశ్వర్య రాజేశ్ తమ కొలీగ్ రాజేశ్ కుమార్తేనని తెలిసి ఎంతో సంతోషం కలిగిందని, ఐశ్వర్య మేనత్త, కమెడియన్ శ్రీలక్ష్మి అందరికీ తెలిసిన వ్యక్తేనని, వారి వారసురాలుగా ఐశ్వర్య ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఇక సినిమా గురించి చెబుతూ, ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారని, మనవద్ద కూడా ఆ స్థాయిలో ప్రోత్సాహం అవసరమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక ఐశ్వర్య రాజేశ్ తో చిరంజీవి వీడియో కాల్ లో మాట్లాడానని కూడా తెలిపారు. మీ నాన్న రాజేశ్, మీ మేనత్త శ్రీలక్ష్మి మాకు బాగా తెలుసమ్మా అంటూ ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. సినిమా పట్ల ఆమె చూపించిన నిబద్ధతను అభినందించారు.

కాగా అంతకుముందే చిరంజీవి నుండి సర్‌ప్రైజింగ్ ఫోన్ కాల్ రావడంతో తాను ఉబ్బితబ్బిబవుతున్నానని హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ తెలిపారు. తను నటిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' (ది క్రికెటర్) టీజర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి ఆమెకు కాల్ చేసి, అభినందిచారని ఐశ్వర్య ట్వీట్ చేసింది. చిరు సర్ కాల్ చేసి, కౌసల్య కృష్ణమూర్తి టీజర్ చాలా బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.. చిరంజీవి గారితో మాట్లాడానంటే ఇంకా నమ్మలేకపోతున్నాను.. అంటూ తన హ్యాపీనెస్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్‌ను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చెశారు. ఈ విషయాన్ని కూడా తెలిపిన నటి.. తన సంతోషానికి అవధులు లేవని చెప్పింది. తమిళ స్టార్ శివ కార్తికేయన్ కీలక పాత్రలో నటించిన సినిమా కణ.. ఐశ్వర్య రాజేష్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో 'కౌసల్య కృష్ణమూర్తి'  పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌లో చేసిన క్యారెక్టర్‌నే ఐశ్వర్య ఈ సినిమాలోనూ చేస్తుండగా, శివ కార్తికేయన్ అతిథి పాత్ర పోషించాడు.

ఓ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువతి అంతర్జాతీయ క్రికెటర్ కావాలనే లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అనేదే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ హైలెట్ అవుతుందని, ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిందని నిర్మాత తెలిపాడు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ఝాన్సీ, సివిఎల్ నరసింహరావు, కార్తీక్ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెమెరా: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, సంగీతం: ధిబు నైనన్ థామస్, కథ: అరుణ్ రాజా కామరాజ్, డైలాగ్స్: హనుమాన్ చౌదరి, ఆర్ట్: ఎస్ శివన్.

It was such a big surprise call from #MegaStarChiranjeevi garu ... he said he loved #KausalyaKrishnamurthy teaser .. am still awestruck d way chiru sir spoke to me .. thank u so much sir ... such a big honour to me @CCMediaEnt

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Naveen polishetty opts for a quirky comedy after latest hit

  వరుస హిట్లతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో

  Jul 16 | నవీన్ పోలిశెట్టి హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల ఆదరణ పొందింది. కామెడీని .. ఎమోషన్ ను కలిపి పండించే పాత్రలో నవీన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా విజయవంతం... Read more

 • Sahoo postponed who gets affected

  ప్రభాస్ అభిమానులకు చేధువార్త.. సాహో విడుదలలో..!

  Jul 16 | ‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబ‌ృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను... Read more

 • Jagapathi babu not part of mahesh babu s sarileru neekevvaru

  మహేష్ బాబుకు జగపతి బాబు షాక్.!

  Jul 16 | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటి పలువురు సీనియర్ స్టార్లు కూడా నటిస్తుండటంతో..... Read more

 • Natural star nani gang leader movie 1st look looks quite interesting

  ‘గ్యాంగ్ లీడ‌ర్’ ఫ‌స్ట్ లుక్..

  Jul 15 | నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. జెర్సీ లాంటి సినిమా త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో నాని ఐదుగురు ఆడ‌వాళ్ల‌తో క‌లిసి... Read more

 • Guna 369 teaser has bland and dated feel to it

  గుణ 369 టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న కార్తీకేయ..

  Jun 17 | ‘ఆర్‌‌ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కార్తికేయకు డిమాండ్ పెరిగింది. వరసపెట్టి సినిమాలను అంగీకరించారు. ఇటీవలే... Read more

Today on Telugu Wishesh