Maharshi making video hulchul on net నెట్టింట్లో ‘మహర్షి’ మేకింగ్ వీడియో సందడి..

Maharshi making video hulchul on net

Making of Maharshi, Mahesh Babu, Pooja Hegde, Allari Naresh, Vamshi Paidipally, tollywood, movies, entertainment

Superstar Mahesh Babu's 'Maharshi' is unstoppable at the box office. Maharshi has been a resounding success and continues to go strong at the box office. The film Unit had released its making video on social media which also does hulchul on net.

నెట్టింట్లో ‘మహర్షి’ మేకింగ్ వీడియో సందడి..

Posted: 05/21/2019 04:28 PM IST
Maharshi making video hulchul on net

ప్రిన్స్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీఇచ్చి సూపర్ స్టార్‌ ఎదిగిన స్టార్ హీరో మహేశ్ బాబు తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ‘మహర్షి’ సినిమా అంచనాలకు మించి వసూళ్లను రాబట్టడంతో సక్సెస్ మీట్ లో తన నైజానికి బిన్నంగా దర్శకుడు వంశీ పైడిపల్లికి ముద్దు పెట్టి మరీ తన సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హిట్ కావడంతో చిత్ర నిర్మాణ యూనిట్ తాజాగా మేకింగ్‌ వీడియోను ఇవాళ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. దీన్ని అభిమానులు షేర్లు, లైకులు చేస్తూ పంచుకోవడంతో మేకింగ్ వీడియో కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఓ గ్రామాన్ని సృష్టించడం, మహేశ్‌బాబు యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించడం తదితర అంశాలను చూపించారు. షూటింగ్‌ సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి, మహేశ్‌ నవ్వుకోవడం.. మహేశ్ సీనియర్‌ నటులతో ముచ్చట్లు చెప్పడం ఎంతో సందడిగా ఉంది. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Making of Maharshi  Mahesh Babu  Pooja Hegde  Allari Naresh  Vamshi Paidipally  tollywood  

Other Articles