Tributes pour in for Veteran Telugu actor Rallapalli రాళ్లపల్లి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Tributes pour in for veteran telugu actor rallapalli narasimha rao who passed away at 74

senior actor rallapalli no more, senior charecter actor Rallapalli, senior comedian Rallapalli, senior villan rallapalli, Rallapalli Venkata Narasimha Rao, rallapalli, Telugu Cinema, lung ailments, death, Tributes, tollywood, entertainment, movies,

Veteran Telugu actor Rallapalli Venkata Narasimha Rao passed away at a private hospital. The 74-year-old actor had been suffering from a lung ailment and was admitted to the hospital on May 15.

రాళ్లపల్లి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Posted: 05/18/2019 11:36 AM IST
Tributes pour in for veteran telugu actor rallapalli narasimha rao who passed away at 74

టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు మృతికి చిత్రీసీమతో పాటు రాజకీయ రంగం నుంచి కూడా సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ మెగాస్గార్ చిరంజీవితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్ సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీరంగ ప్రముఖులు ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాటక, చలనచిత్ర రంగాల్లో రాళ్లపల్లిది ప్రత్యేక స్థానమని, తనదైన శైలిలో సునిశిత హాస్యంతో గుర్తింపు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రాళ్లపల్లి చెరగని ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు.

సీనియర్ నటుడు రాళ్లపల్లి మృతి పట్ల వైసీపీ అధినేత జగన్ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాళ్లపల్లి కన్నుమూసిన విషయం తెలిసి జగన్ ఎంతో విచారానికి లోనయ్యారంటూ వైసీపీ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రాళ్లపల్లి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఓ నటుడిగానే కాకుండా దర్శకరచయితగా అటు నాటక రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ అనితరసాధ్యమైన రీతిలో ఎన్నో ఘనతలు సాధించారని వైసీపీ రాళ్లపల్లిని కీర్తించింది.

రాళ్లపల్లి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నై వాణీమహల్లో నాటకాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్లపల్లిని కలిశానని చిరంజీవి వెల్లడించారు. రాళ్లపల్లి నటన సహజంగా ఉంటుందని, అందుకే ఆయన నటన అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో రాళ్లపల్లి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు  రాళ్లపల్లి హైదరాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని మోతీనగర్ లోని నివాసానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాళ్లపల్లి తన కెరీర్ లో సుమారు 800కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పాత్ర ఏదైనా ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయన సొంతం. రాళ్లపల్లి 1945లో తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు. ఆయన పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు.

కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. ఊరుమ్మడి బతుకులు అనే చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు, తూర్పు వెళ్లే రైలు వంటి పలు చిత్రాలు ఉన్నాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో ఆయన కీలకపాత్రల్లో నటించారు. మణిరత్నం ’బొంబాయి’ సినిమాలో ‘హిజ్రా’ పాత్రలో రాళ్లపల్లి నటించి మెప్పించారు. నాటకరంగంలో విశేష అనుభవం ఉండడంతో ఆయనకు చిత్రసీమలో ఎదురులేకుండా పోయింది. రాళ్లపల్లి ఓవైపు సినిమాల్లో నటిస్తూ కూడా నాటకాలు వేశారు. ఆ విధంగా తన వయసు సహకరించేవరకు దాదాపు 8000 నాటక ప్రదర్శనలు ఇవ్వడం విశేషం అని చెప్పాలి. ఆయన చివరగా నటించిన చిత్రం మారుతి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన భలేభలే మగాడివోయ్ చిత్రం. ఆపై వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఇంటికే పరిమితం అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles