Maharshi first week box office collections report దుమ్మురేపుతున్న ‘మహర్షి’ తొలివారం కలక్షన్లు..

Mahesh babu s maharshi movie first week worldwide box office collections impressive

Maharshi first week worldwide box office collections, maharshi box office, maharshi first week box office collections, maharshi worldwide collections, Mahesh babu, pooja hedge, allari naresh, vamsi paidipally, 1st week collections, box office collections, movies, entertainment, tollywood

Maharshi has emerged as a big winner at the box office and the film has completed the first week of run in the theatres. The Mahesh Babu movie has now stepped in to the second week of run in almost all the centres that it has released.

దుమ్మురేపుతున్న ‘మహర్షి’ తొలివారం కలక్షన్లు.. అక్కడ డిజాస్టర్

Posted: 05/16/2019 03:46 PM IST
Mahesh babu s maharshi movie first week worldwide box office collections impressive

భారీ బడ్జెట్.. భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మ‌హ‌ర్షి’ సినిమా తొలివారం నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వెన‌క‌బ‌డినా కూడా ఆంధ్రా తెలంగాణ‌లో మాత్రం దూసుకుపోతుంది. తెలుగు చిత్రపరిశ్రమలో ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక దర్శకుడిగా వంశీ పైడిపల్లికి కథ, కథనం సినిమాకు ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో పోస్టర్స్ పై కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

అలా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలో ఈ సినిమా 59.37 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 21.67 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. అయితే ఇందుకు ఐదు షోలతో పాటు టికెట్ ధర పెంపు కూడా కారణంగా పరిగణిస్తున్నారు విశ్లేషకులు. అయినా ఇది మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. మహేశ్ బాబు అభిమానులు కోరుకున్నట్టుగానే ఆయనకి భారీ విజయం దక్కింది.

ఈ చిత్రం సేఫ్ కావాలంటే మ‌రో 30 కోట్లు రావాలి. రెండో వారం కూడా మ‌హ‌ర్షి దూకుడు కొన‌సాగేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్రానికి పోటీగా ఇప్పుడు మ‌రే సినిమా లేదు. దాంతో క‌చ్చితంగా రెండో వారం కూడా మ‌హేశ్ బాబు ర‌చ్చ చేయ‌డం ఖాయం. అయితే వీక్ డేస్‌లో ఇప్ప‌టికే సినిమా చాలా చోట్ల స్లో అయింది కానీ చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌మోష‌న్స్ కూడా భారీగానే చేస్తున్నారు నిర్మాత‌లు. చిత్ర విజయానికి తన వంతు బాధ్యతగా అటు సీఈవోలతో, ఇటు రైతుల‌తో కూడా ముఖాముఖి అవుతున్నాడు మ‌హేశ్ బాబు. అయితే ఓవ‌ర్సీస్‌లో మాత్రం మ‌హ‌ర్షి అనుకున్నంత‌గా ప‌ర్ఫార్మ్ చేయ‌కపోవడంతో డిజాస్ట‌ర్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Prabhas to play nitesh tiwari s ravan role in ramayana

  రామాయణంలో అసురుడి పాత్రలో ప్రభాస్.?

  Sep 18 | టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ‘రామాయణం’ ప్రాజెక్ట్‌ను రెండు నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రామాయణ మహాకావ్యంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తీసుకొని తెరపై ఆవిష్కరించారు. అయితే, తొలిసారి... Read more

 • Jayasudha awarded tsr abhinaya mayuri award

  జయసుధకు అభినయ మయూరి అవార్డు ప్రదానం

  Sep 18 | సహజనటి జయసుధకు మరో అరుదైన గౌరవం అందుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి.. జయసుధను అభినయ మయూరి బిరుదుతో సత్కరించారు. సుబ్బిరామి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖ పట్నంలో సుబ్బిరామిరెడ్డి... Read more

 • Sye raa trailer chiranjeevi film has grandeur written all over it

  మెగా అభిమానులకు ట్రైయిలర్ ట్రీట్ ఇచ్చిన కొణిదెల ప్రోడక్షన్స్.!

  Sep 18 | స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రోడక్షన్స్ లో నిర్మితమవుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 151వ చిత్రంగా ప్రముఖ... Read more

 • Chiranjeevi s sye raa pre release event postponed

  చిరంజీవి ‘సైరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మళ్లీ వాయిదా

  Sep 17 | తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపోందిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం వచ్చే నెల 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదల కానుంది.... Read more

 • Varun tej excelled in the role beyond expectations harish shankar

  వరుణ్ తేజ్ ‘వాల్మీకి’లో శ్రీదేవిలా పూజాహెగ్డే మెరుపులు

  Sep 17 | వరుణ్ తేజ్..  హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'వాల్మీకి' చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. గద్దలకొండ గణేష్‌కు జోడిగా శ్రీదేవిగా అలరించనుంది పూజా..... Read more

Today on Telugu Wishesh