Actor Karan Oberoi arrested కాని కార్యం చేసి.. కటకటాల వెనక్కి కరణ్ ఒబెరాయ్..

Telly actor karan oberoi arrested over charges of rape and blackmail

Karan Oberoi, Karan Oberoi rape case, blackmail, mumbai court, Oshiwara police station, Andheri Court, publicity stunt, Bollywood, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

Jassi Jaisa Koi Nahin' actor Karan Oberoi allegedly raped a woman, filmed the act and later threatened to release the video if she failed to pay him money, say the police.

కటకటాల వెనక్కి కరణ్ ఒబెరాయ్.. జ్యోతిషురాలి పిర్యాదు..

Posted: 05/07/2019 06:26 PM IST
Telly actor karan oberoi arrested over charges of rape and blackmail

ఇండియాలో మీటూ ఉద్యమం కాసింత చల్లబడుతున్న క్రమంలో మరో నటుడు దానిని తట్టిలేపే ప్రయత్నం చేశారు. ఏకంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని లోబర్చుకుని వంచించాడు. ఆ యువతి ప్రముఖ జ్యోతిష్యురాలు కావడంతో కాసింత వెనుకాముందు అలోచించింది. అయితే నటుడి వేధింపులు రానురాను మరింతగా పెరుగుతున్న క్రమంలో అమె ధైర్యం కూడగట్టుకుని బాలీవుడ్ టీవీ నటుడు, మోడల్ కరణ్ ఒబెరాయ్‌ను పోలీసులకు పిర్యాదు చేసింది. అమె పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నటుడ్ని కటకటాల వెనక్కి పంపారు.

జ్యోతిష్యురాలి పిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.. ప్రముఖ జ్యోతిష్యురాలకి ప్రేమ పేరుతో దగ్గరైన టీవీ నటుడు కరణ్.. అమెను పరిణయమాడుతానని మాట ఇచ్చాడు. అతని మాటలు విశ్వసించిన అమె అతనితో సరదాగా తిరిగింది. ఇదే అవకాశంగా బావించిన కరణ్ అమెను నమ్మించి, లొంగదీసుకుని.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక, ఈ ఘటనను వీడియో తీశాడు. అనంతరం దానిని చూపించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే దానిని బయటపెడతానని బెదిరించాడు.

దీంతో ఆమె ముంబైలోని ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా, మహేశ్ భట్ ‘స్వాభిమాన్’తో టీవీ జర్నీ ప్రారంభించిన కరణ్.. సాయా, జస్సి, జైసీ కోయి నహీ, ఇన్‌సైడ్ ఎడ్జ్ తదితర షోలతో పాప్యులర్ అయ్యాడు. ఫ్యాషన్, ఫిట్‌నెస్ మోడల్ అయిన కరణ్ పలు ప్రకటనల్లోనూ నటించాడు. పాప్ బ్యాండ్ ‘బ్యాండ్ ఆఫ్ బాయ్స్‌’లో కరణ్ సభ్యుడు కూడా. కాగా, పోలీసులు నేడు కరణ్‌ను అంధేరీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles