Jagapathi Babu turns antagonist for NBK బాలయ్య చిత్రంలో విలన్ గా జగపతి బాబే..

Balakrishna jagapathi babu to lock horns again

Jagapathi Babu, Legend, Balakrishna, Dictator, KS Ravi Kumar, C.Kalyan, Chirantan Bhatt, tollywood, movies, entertainment

Actor Jagapathi Babu, who reinvented his career as a villain with Legend, will once again lock horns with Nandamuri Balakrishna upcoming actioner to be helmed by KS Ravi Kumar.

కన్ఫార్మ్: బాలయ్య చిత్రంలో విలన్ గా జగపతి బాబే..

Posted: 05/06/2019 10:55 PM IST
Balakrishna jagapathi babu to lock horns again

శతాధిక చిత్రాల క‌థానాయ‌కుడు న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణ హీరోగా.. ప్ర‌ముఖ దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం 'జైసింహా'.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా మరోమారు ఇదే కాంబినేషన్ లో మరో ప్రాజెక్టును పట్టాలెక్కెక్కనుంది. ఇప్పటికే ఈ మేరకు ఏర్పాటు కూడా సాగుతున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా కెఎస్ రవికుమార్ చకచకా పనులు కానిచ్చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా వుంటుందట. అందువలన చాలామంది పేర్లను పరిశీలించారని తెలుస్తోంది. చివరికి ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌ పాత్రకు ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ - జగపతిబాబు కాంబినేషన్లో వచ్చిన 'లెజెండ్' సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ తెరపై తలపడనున్నారన్నమాట. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapathi Babu  Legend  Balakrishna  Dictator  KS Ravi Kumar  tollywood  

Other Articles