'Ninu Veedani Needanu Nene' Teaser out ఆసక్తిరేపుతున్న 'నిను వీడని నీడను నేనే' టీజర్‌

Ninu veedani needanu nene teaser looks exciting

Ninu Veedani Needanu Nene teaser looks exciting, Ninu Veedani Needanu Nene, Ninu Veedani Needanu Nene Teaser, Sundeep Kishan, Anya Singh, caarthick raju, S S Thaman, movies, entertainment, tollywood

Sundeep Kishan celebrates his birthday today (May 6). On the occasion of his birthday, the teaser of his upcoming release ‘Ninu Veedani Needanu Nene’ was released. The teaser looks quite interesting and its premise is very exciting.

ఆసక్తిరేపుతున్న 'నిను వీడని నీడను నేనే' టీజర్‌

Posted: 05/06/2019 10:08 PM IST
Ninu veedani needanu nene teaser looks exciting

టాలీవుడ్ యువ హీరో సందీప్‌ కిషన్ 'నిను వీడని నీడను నేనే' అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టనున్నాడు. సందీప్ కిషన్ హీరోగా.. అన్యసింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను కార్తీక్‌ రాజు డైరెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సందీప్‌ ఈ సినిమా కోసం నిర్మాతగా మారడం విశేషం. వెంకటాద్రి టాకీస్‌, వి స్టూడియోస్,‌ విస్తా డ్రీమ్‌ సంస్థలు ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి.

తమన్‌ బాణీలు అందిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఈరోజు రిలీజ్ చేసింది. అది 2013 అనుకుంటా.. ఓ మిస్టరీ కేసు అంటూ నటుడు మురళీ శర్మ డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమౌతోంది. ఇందులో సందీప్‌ కిషన్‌ ఏదో సమస్యతో బాధపడుతూ కనిపించారు. సందీప్‌ అద్దం ముందు నిల్చుంటే.. ప్రతిబింబంలో వెన్నెల కిశోర్‌ కనిపించడం ఆసక్తిని రేపించేలా అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ninu Veedani Needanu Nene  Sundeep Kishan  Anya Singh  caarthick raju  S S Thaman  tollywood  

Other Articles