Nikhil gets slapped by police 36 times పోలీసుల చేతిలో 36సార్లు లెంపకాయలు తిన్న హీరో నిఖిల్

Tollywood hero nikhil siddhartha gets slapped by police 36 times

Arjun Suravaram, Nikhil, Nikhil Siddharth, Lavanya Tripathi, special episode, promotion episode, TN Santosh, tollywood, movies, entertainment

Young hero Nikhil got beaten up by a police so badly. This is all part of his upcoming movie ‘Arjun Suravaram’ and this is revealed by Nikhil himself while doing a special episode as part of promotions with the female lead Lavanya Tripathi.

పోలీసుల చేతిలో 36సార్లు లెంపకాయలు తిన్న హీరో నిఖిల్

Posted: 04/23/2019 10:33 PM IST
Tollywood hero nikhil siddhartha gets slapped by police 36 times

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పోలీసుల చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసు అధికారి ఆయనపై వున్న ఆగ్రహంతో ఏకంగా 36 సార్లు ఆయన చెంపలు వాయించారు. ఔనా.. ఇది నిజమేనా అన్న అనుమానాం మీకు రావచ్చు. కానీ ఇది నిజమే. అయితే హీరో నిఖిల్ గా కాకుండా జర్నలిస్టు అర్జున్ సురవరంగా ఇది అనుభవించారు. ఇప్పుడు మీకు అసలు విషయం బోధపడిందని మాకు తెలుసు. త్వరలో 'అర్జున్ సురవరం' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిఖిల్ ఈ చిత్రంలో తన క్లోజప్ షాట్ కోసం ఇలా 36 సార్లు టేక్ తీసుకున్నాడట.

కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1న ప్రపంచ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం.. ప్రమోషన్లలో హీరో, హీరోయిన్ లావణ్య త్రిపాఠి బిజీగా గడుపుతున్నాడు. సినిమా ప్రచారంలో భాగంగా నిఖిల్, హీరోయిన్ లావణ్య మీద స్పెషల్ ఓపిసోడ్ చేశారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందలో నిఖిల్‌ పోలీస్ చేతిలో 36 సార్లు దబ్బలు తిన్నాడన్న విషయాన్ని కూడా స్వయంగా నిఖిల్ వెల్లడించిదనే

" స్క్రిప్ట్ దశలో చిన్న సినిమాగా అనిపించింది .. కానీ సెట్స్  పైకి వెళ్లిన తరువాత పెద్ద సినిమా అయిపోయింది. ఈ సినిమాలో నేను జర్నలిస్ట్ గా కనిపిస్తాను. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను చెంపదెబ్బ కొట్టే సీన్ వుంది. ఆ పోలీస్ ఆఫీసర్ కొట్టగానే నేను ఫోర్స్ గా కింద పడిపోవాలి. ఆ షాట్ ని టైట్ క్లోజ్ లో తీయాలని డైరెక్టర్ చెప్పాడు. 36 టేకులకు ఆ షాట్ ఓకే అయింది. అన్నిసార్లు చెంపదెబ్బలు తినవలసి వచ్చిందన్న మాట. ఇక లావణ్య త్రిపాఠి చేతిలో కూడా నేను చెంపదెబ్బ తినే సీన్ వుంది. అదృష్టం కొద్దీ ఆ షాట్ ఒకే టేకులో ఓకే అయింది .. లేదంటే అయిపోయేవాడినే" అంటూ చెప్పుకొచ్చాడు. పోసాని కృష్ణమురళి .. నాగినీడు .. ప్రగతి ముఖ్యమైన పాత్రలను పోషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Suravaram  Nikhil  Nikhil Siddharth  Lavanya Tripathi  TN Santosh  tollywood  

Other Articles