మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన మగధీర చిత్రం గుర్తుందా.. అయన చిత్ర కెరీర్ లో అదో మైలురాయి. ఇప్పుడా చిత్రం గురించి ఎందుకు చెబుతున్నారు.. ఓహో రాజమౌళి కాంబినేషన్ లో చెరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ గురించి చెప్పబోతున్నారా.? అనుకుంటున్నారు కదూ.. కానీ అలా అని చెప్పి మీ మనసు నోప్పించలేము. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టే వేరప్పా. రాంచరణ్ జన్మదినం రోజు అనగా మార్చి 27ను పురస్కరించుకుని ఆయన నటించిన మగధీర చిత్రంలోని పాత్రల బొమ్మలను గ్రీటింగ్ కార్డులపై గీసి ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్’ అని రాసి పంపించారు. ఇలాంటివి ఏకంగా 50కి పైగా గ్రీటింగ్ కార్డులు చరణ్ కు అందాయి.
ఔనా.. ఇంతకీ వాటిని పంపింది ఎవరు.? అన్న డీటైల్స్ లోకి వెళ్లే ముందు ఈ నెల (ఏప్రిల్ ) 27 రాబోతున్న తరుణంలో ఇంత అలస్యంగా గ్రీటింగ్ కార్డ్స్ పంపించిందెవరు.? అంటారా.? అవి మనవాళ్లు పంపించినవి కాదు. ఏకంగా జపాన్ దేశం నుంచి వచ్చినవి. జజపాన్ అభిమానులు రాంచరణ్ ను ఈ గిప్టులతో సర్‌ప్రైజ్ చేశారు. ‘మగధీర’ చిత్రంలోని పాత్రల బొమ్మలను గ్రీటింగ్ కార్డులపై గీసి ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్’ అని రాసి పంపించారు. వాటిని అందుకున్న చరణ్ ఈ గ్రీటింగ్ కార్డును ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
వీటితో పాటు ‘జపాన్ నుంచి స్వీట్ సర్‌ప్రైజ్‌ను అందుకున్నాను. నా పట్ల మీకున్న ప్రేమానురాగాలు నన్నెంతో సంతోషపరిచాయి. నా జపాన్ అభిమానులకు ప్రేమను పంపుతున్నాను. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. థాంక్యూ జపాన్’ అని పేర్కొన్నారు. చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రం జపాన్ లో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more