Dil Raju accused of stealing ప్రభాస్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రం కాపీయేనట..

Court says prabhas mr perfect is a copy

young rebel star prabhas, Prabhas, Mr Perfect, Dil Raju, Dasaradh, Hyderabad Civil Court, Shyamaladevi, novel 'Naa Manasu Korindhi Ninne', copyright case, Kajal, Taapsee, Prakash Raj,movies, entertainment, tollywood

The Hyderabad Civil Court has declared that hero Prabhas 2011 movie 'Mr. Perfect' is a copy of a novel by name 'Naa Manasu Korindhi Ninne.' Writer of the novel, Shyamaladevi had filed a copyright case in the year 2017.

ప్రభాస్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రం కాపీయేనట..

Posted: 04/22/2019 10:02 PM IST
Court says prabhas mr perfect is a copy

సినిమారంగంలో ఒక సమస్యకు ఇద్దరు డైరెక్టర్లకో లేక సినీ కథ రచయితలకో ఒకే విధమైన అలోచన రావచ్చు. అయితే ఇళా కాకతాళీయంగా జరిగినా.. చిత్రసీమలో మాత్రం అది తన క్రియేటివిటీ అని తన కథను కాపీ కొట్టారన్న ఆరోపణలు రావడం సహజమే. ఇటీవల పలు చిత్ర కథల విషయంలో ఇలాంటి అరోపణలు రావడం సహజమైపోయింది. ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన Mr. పర్‌ఫెక్ట్ కథ కూడా కాపీ కొట్టారనే వార్త తాజాగా సంచలనం సృష్టిస్తుంది. ఔనా..? అయినా ఎప్పుడు 2011లో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు కాఫీ అనే విషయం హాట్ టాపిక్ ఎలా అయ్యిందంటారా.. ఈ మేరకు కోర్టులో నడుస్తున్న కేసుపై ఇవాళ న్యాయస్థానం తీర్పునివ్వడంతో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దశరథ్ డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మించిన Mr.పర్‌ఫెక్ట్ సినిమా 22-04-2011 లో రిలీజ్ అయ్యింది. కాజల్, తాప్సీ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా హిట్ అయ్యింది. రిలీజ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత, టీవీలో సినిమా చూస్తూ, తను వ్రాసిన 'నా మనసు కోరింది నిన్నే' అనే నవలను కాపీ కొట్టి, Mr.పర్‌ఫెక్ట్ తీసారని గ్రహించిన రచయిత శ్యామలా దేవి కోర్ట్‌‌‌‌లో కేసు వేశారు. గతకొద్ది కాలంగా కేసు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆమె చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది.

Mr.పర్‌ఫెక్ట్ సినిమాలో కథ, మాటలు, సన్నివేశాలు.. శ్యామలా దేవి రాసిన నవలలోనివే అని సిటీ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. టీవీలో చూసే వరకూ తన నవలని కాపీ చేసారని తెలియదని, దిల్ రాజుని కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, రచయితలో సంఘంలో కంప్లైంట్ చేస్తే, దశరథ్ తప్పుడు ఆరోపణలు చేసాడని, తప్పకుండా దిల్ రాజు దగ్గరినుండి నష్ట పరిహారం వసూలు చేస్తానని రచయిత శ్యామలా దేవి అన్నారు. 22-04-2019 నాటికి Mr.పర్‌ఫెక్ట్ రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా కోర్టు తీర్పునివ్వడం విశేషం. శ్యామలా దేవి వ్యాఖ్యలపై Mr.పర్‌ఫెక్ట్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Mr Perfect  Dil Raju  Dasaradh  Hyderabad Civil Court  Kajal  Taapsee  Prakash Raj  tollywood  

Other Articles

 • Kousalya krishnamurthy official trailer aishwarya rajesh rajendra prasad

  ఆసక్తి రేపుతున్న ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ట్రైయిలర్

  Aug 19 | క్రికెట్ నేపథ్యంలో వచ్చిన 'జెర్సీ' విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అదే క్రికెట్ నేపథ్యంలోనే మరో సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమానే 'కౌసల్య కృష్ణమూర్తి'. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా భీమనేని... Read more

 • Kalyan ram s entha manchivadavuraa set to be released on sankranti

  సంక్రాంతి బిగ్ ఫైట్ లో నందమూరి కల్యాణ్ రామ్.!

  Aug 19 | విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకుసాగుతున్నాడు. అయితే ఇలా రోటీన్ గా వుంటే గుర్తింపు ఏముంటుందని భావించాడో ఏమో తెలియదు కానీ.. ఈ... Read more

 • Big b rajani mohanlal yash voice over for chiranjeevi s sye raa

  ‘సైరా’ కోసం పంచ పాండవులను రంగంలోకి దింపిన రాంచరణ్

  Aug 19 | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్మాణవర్గాలు... Read more

 • Saaho new song bad boy out prabhas and jacqueline fernandez sizzle in peppy track

  ‘బ్యాడ్ బాయ్’ పాటలో ఇరగదీసిన జాక్విలిన్

  Aug 19 | సుజిత్ దర్శకుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'సాహో' అంతా ముగించుకుని ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రితం రోజునే ప్రీ-రిలీజ్ ఈవేంట్ ను ఘనంగా జరుపుకున్న చిత్ర... Read more

 • South superstar allu arjun is all praises for venkat ramji s evaru

  ఎవరు చిత్రం నాకు బాగా నచ్చింది: అల్లు అర్జున్ ప్రశంస

  Aug 19 | సామాజిక సేవతో పాటు మానవత్వంతో స్పందించడంలోనూ మన హీరోలు తమకు తామే సాటి అనిపించుకుంటున్నారు. ఇదే సమయంలో టేకింగ్, కథ, కథనం, ఇత్యాదులు బాగుంటే ఒకరి సినిమాలను మరోకరు ఎలాంటి బేషజాలు లేకుండా ప్రశంసిస్తూ..... Read more

Today on Telugu Wishesh