anchor rashmi on bihar rape attempt and acid attack incident అలాంటి వాళ్లను నరికి పారేయాలి : రష్మీ ఆగ్రహం..

Anchor rashmi gautam angry on bihar rape attempt and acid attack incident

anchor rashmi on bihar incident, anchor rashmi kill the rapist, anchor rashmi on rapists, anchor rashmi, rashmi gautam, rape, gangrape, kill the rapists, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

Anchor and actress rashmi gautam, who became popular with jabardast comedy show is angry on bihar rape attempt and acid attack incident

అలాంటి వాళ్లను నరికి పారేయాలి : రష్మీ ఆగ్రహం..

Posted: 04/20/2019 07:58 PM IST
Anchor rashmi gautam angry on bihar rape attempt and acid attack incident

ఐదేళ్ల క్రితం దేశ రాజధానిలో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన తరువాత ఈ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. నేరాలకు పాల్పడే బాలుర వయస్సులో సవరణలు.. అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టాలు ఇలా ఎన్ని తీసుకువచ్చినా.. నానాటికీ అబలలపై పైశాచిక మృగాలు తెగబడుతున్న ఘటనలు అధికమవుతున్నాయే కానీ.. తగ్గడం మాత్రం లేదు. ఇలాంటి ఘటనలపై అటు ప్రభుత్వాలు కూడా తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. నేరం చేసిన వారిని పట్టుకోవడం, న్యాయస్థానాల్లో నిలబెట్టడం పోలీసుల పని. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెబుతూ చేతులెత్తేస్తున్నారు.

ఒక్కప్పుడు అమ్మాయిలు రాత్రి వేళ బయట నుంచి ఇంటికి రాకపోతే అందోళన చెందే కుటుంబసభ్యులు.. ప్రస్తుతం గడపదాటిన ఆడపడచులు ఇంటికి వచ్చే వరకు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. మన నేతలు మాత్రం అర్థరాత్రిళ్లు అమ్మాయిలకు బయటకు వెళ్లే పనేంటి అంటూ అంక్షలు పెడుతున్నారే తప్ప.. పరస్త్రీ లక్ష్మీదేవితో సమానం అని మాత్రం ఎందుకు మగబిడ్డలకు బోధించడం లేదో అర్థంకాని ప్రశ్న. ఈ క్రమంలో బీహార్ లో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా అనేక మంది మండిపడుతున్నారు.

తాజాగా ఈ ఘటనపై యాంకర్‌, సినీ నటి రష్మి గౌతమ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి యత్నించగా, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆ నలుగురు యువకులు ఆమెపై యాసిడ్‌ దాడి చేశారు. ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా రష్మి మండిపడ్డారు. ‘రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటన ఎంతో భయానకంగా ఉంటోంది. మగాళ్లమని భావిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడే వారిని నరికిపారేయాలి. లేకపోతే ఒక్క రాత్రిలోనే స్త్రీ అన్నది కనిపించకుండా పోతుంది. అలా చేసినప్పుడే మానవాళికి స్త్రీ జాతి విలువ తెలుస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anchor rashmi  rashmi gautam  rape  gangrape  kill the rapists  tollywood  

Other Articles

 • Teja opens up about sita re shoot says it will be a hit

  ‘సీత’పై పూర్తి నమ్మకం వుందంటున్న తేజ

  May 21 | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారి లేడి ఓరియంటెండ్ చిత్రంలో నటిస్తున్న సీత చిత్రంపై తనకు పూర్తి నమ్మకం వుందని దర్శకుడు తేజ వ్యక్తం చేశాడు. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా... Read more

 • Prabhas shares the surprise with fans

  అభిమానులకు ప్రభాస్ ‘సర్ ప్రైజ్’.. అదేంటో తెలుసా.?

  May 21 | టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన బాహుబలి చిత్రాల తరువాత కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న 'సాహో' చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారెడు అంచనాలు వున్నాయి. బాహుబలితో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా... Read more

 • Maharshi making video hulchul on net

  నెట్టింట్లో ‘మహర్షి’ మేకింగ్ వీడియో సందడి..

  May 21 | ప్రిన్స్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీఇచ్చి సూపర్ స్టార్‌ ఎదిగిన స్టార్ హీరో మహేశ్ బాబు తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ‘మహర్షి’ సినిమా అంచనాలకు మించి వసూళ్లను రాబట్టడంతో సక్సెస్ మీట్ లో... Read more

 • Falaknuma das finalizes its release date

  నెలాఖరున కలుస్తానంటున్న ఫలక్ నుమా దాస్

  May 18 | వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ.. ఫలక్‌ నుమా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా... Read more

 • Raashi khanna s apology to her dubbing artist in ayogya

  డబ్బింగ్ అర్టిస్ట్ రవీనాకు రాశీఖన్నా సారీ..!

  May 18 | హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్టును స్టార్ గా మలిచారు. స్టార్ అంటే సినిమాల్లో స్టార్ గా కాకపోయినా.. ఇక్కడ ఇద్దరి మంచితనంతో ఇద్దరూ మనస్సున్న మనషులుగా, స్పందించే హృదయాలున్నవారిగా గుర్తింపుసొందారు, మరి స్టార్... Read more

Today on Telugu Wishesh