Vishal turns into a striking anti-hero టెంపర్ రేపుతున్న విశాల్ అయోగ్య ట్రైలర్..

Vishal as the rowdy and corrupt cop fits well in venkat mohan s directorial debut

Ayogya Official Trailer, Vishal, Raashi Khanna, R.Parthiepan, Venkat Mohan, Sam CS, B.Madhur, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

Vishal's next action entertainer is going to be Ayogya directed by debutant Venkat Mohan and produced by Light House Productions LLP Tagore Madhu, and the movie is the official Tamil remake of the 2015 Tollywood hit movie Temper.

టెంపర్ రేపుతున్న విశాల్ అయోగ్య ట్రైలర్..

Posted: 04/19/2019 09:14 PM IST
Vishal as the rowdy and corrupt cop fits well in venkat mohan s directorial debut

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన 'టెంపర్' మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమా 'అయోగ్య' పేరుతో రీమేక్ అయింది. టెంపర్ కథా, కథనంతోనే కాలీవుడ్ లో దర్శకుడిగా మారుతున్న వెంకట్ మోహన్ ఈ సినిమాను రూపోందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేయగా తమిళనాట కూడా ఈ చిత్రం టెంపర్ రేపడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరో పాత్రలోని వేరియేషన్స్ ను ఈ ట్రైలర్ ద్వారా ఆవిష్కరించారు. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పార్తీబన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలోనూ ఈ సినిమా భారీ హిట్ కొడుతుందనే నమ్మకంతో విశాల్ వున్నాడు. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుందన్న ఆశలు, అంచనాలు ఎలా వుంటాయన్నది చిత్రం విడుదలైయ్యే వరకు వేచి చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh