Ram Charan team up with Vamsi Paidipally వంశీ పైడిపల్లితో మరోసారి జతకట్టనున్న రాంచరణ్

Ram charan and vamsi paidipally to team up

RRR, Ram Charan, Vamsi paidipally, Yevadu, Tarak, NTR, Rajamouli, Baahubali director, movies, entertainment, tollywood

Mega hero Ram Charan is sweating out for RRR, a high voltage periodic action drama directed by SS Rajamouli. Vamsi Paidipally will direct the project and the discussions are through recently.

వంశీ పైడిపల్లితో మరోసారి జతకట్టనున్న రాంచరణ్

Posted: 04/12/2019 10:57 PM IST
Ram charan and vamsi paidipally to team up

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, 2020 జూలై 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాతనే చరణ్ తన తదుపరి సినిమాను మొదలుపెట్టనున్నాడు.

ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన వద్దకు పలు స్ర్కిప్టులతో పలువురు దర్శకులు వచ్చినా.. ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడిగా వంశీ పైడిపల్లి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఇటీవలే చరణ్ ను కలిసి వంశీ పైడిపల్లి ఒక లైన్ చెప్పాడట. లైన్ చాలా బాగుందనీ .. పూర్తి కథను సిద్ధం చేసి వినిపించమని చరణ్ చెప్పినట్టుగా సమాచారం.

తన తాజా చిత్రమైన 'మహర్షి' మే 9వ తేదీన విడుదలైన తరువాత, చరణ్ ప్రాజెక్టుపై కూర్చోవాలని వంశీ పైడిపల్లి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి సినిమాను చరణ్ పూర్తిచేసేలోగా .. ఆయన తదుపరి సినిమాకి సంబంధించిన పనులను సిద్ధం చేయాలనే దిశగా వంశీ పైడిపల్లి రంగంలోకి దిగుతున్నాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎవడు' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Vamsi paidipally  Yevadu  RRR  NTR  Rajamouli  tollywood  

Other Articles

Today on Telugu Wishesh