Fan's Viral 'Love Letter ' To Rashmika Mandanna రష్మిక హృదయాన్ని తాకిన అభిమాని ప్రేమలేఖ

Fan s viral love letter to rashmika mandanna

Rashmika mandanna fan letter, rashmika mandanna fans, rashmika mandanna twitter, actress rashmika mandanna, tollywood, movies, entertainment

Actress Rashmika Mandanna recieved a letter from a fan, who wrote a heart-warming letter for Rashmika and thanked her for supporting her well-wishers and interacting with them quite frequently.

రష్మిక హృదయాన్ని తాకిన అభిమాని ప్రేమలేఖ

Posted: 04/12/2019 10:12 PM IST
Fan s viral love letter to rashmika mandanna

తెలుగు .. కన్నడ భాషల్లో కథానాయికగా రష్మిక మందన వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత ఏడాది అమెకు ఎంతగా అచ్చివచ్చిందంటే గీతాగోవిందం చిత్రంతో అమె ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత దేవదాసు చిత్రంలో వచ్చినా ఆ చిత్రం అమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. కాగా, సినిమా .. సినిమాకి ఆమె అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఒక అభిమాని ఆంగ్లంలో ఆమెకి రాసిన ప్రేమలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"రష్మిక గారు .. మీరంటే నాకు పిచ్చి అభిమానం. మీ అందం .. నవ్వు .. అభిమానుల పట్ల మీరు చూపే గౌరవం నన్ను మీ అభిమానిగా మార్చేశాయి. ఈ భూమ్మీద నేను మిమ్మల్ని ఇష్టపడినంతగా మరెవరూ ఇష్టపడలేరేమో. నా హృదయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. తొలిసారిగా మిమ్మల్ని తెరపై చూసినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను .. చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నాను. నాకు తెలుగు .. కన్నడ భాషలు తెలియవు. ప్రేమకి భాష అవసరమేకానీ .. అడ్డంకి కాదు అనే విషయం మరోమారు రుజువైంది" అని ఆ యువకుడు రాసుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles