Prabhas Lady Fan Slaps Prabhas In USA Airport బాహుబలిని కొట్టిన ఫ్యాన్.. అమెరికా ఎయిర్ పోర్టులో..

Prabhas slapped by an excited fan after posing for a selfie together

Prabhas, Baahubali, Saaho, Shraddha Kapoor, Baahubali The Conclusion, prabhas fan US airport, prabhas US airport, bollywood, tollywood, movies, entertainment

The Baahubali star Prabhas popularity has only soared, a young fan excited on spotting Prabhas and asked for a photograph with the actor, Prabhas obliged. After the picture was clicked, in her excitement, she accidentally slapped Prabhas.

పబ్లిక్ ప్లేస్ లో ప్రభాస్ కనబడితే.. ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇంతే..!

Posted: 03/05/2019 08:41 PM IST
Prabhas slapped by an excited fan after posing for a selfie together

టాలీవుడ్ హీరో ప్రభాస్ కు శంషాబాద్ విమానాశ్రయంలో విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ అన్న తర్వాత సినీతారలతో ఫొటోలకు ఉత్సాహం చూపించడం సాధారణమైన విషయమే అయినా ఒక్కోసారి వాళ్లు అత్యుత్సాహం చూపించి తారలను ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ప్రభాస్ కూడా ఓ అభిమాని ఆనందం పట్టలేక చేసిన చర్యతో విస్మయానికి గురయ్యాడు. తాను ఏకంగా బాహుబలితో ఫోటో తీసుకున్న ఆనందంలో అభిమాని చేసిన చర్య సంచలనంగా మారింది.

శంషాబాద్ విమానాశ్రయంలో తన అసిస్టెంట్ తో కలిసి బయటికి వస్తున్న ప్రభాస్ ను చూసి ఓ యువతి, యువకుడు ఎంతో ఉద్విగ్నతకు గురయ్యారు. ముఖ్యంగా అ యువతి ప్రభాస్ ను చూడగానే ఆనందం పట్టలేకపోయింది. ఫుల్ హ్యాండ్స్ కాటన్ షర్ట్, హాఫ్ ప్యాంట్స్ తో ఉన్న ఆ యువతి పరుగున వెళ్లి ఫొటో ప్లీజ్ అనడంతో ప్రభాస్ ఒప్పుకున్నాడు. ఫోటో తీసుకున్న తరువాత ఆ యువతి.. తాను ప్రభాస్ తో ఫోటో దిగిన ఆనందంతో ఉబ్బితబ్బిబైంది.

 సంతోషంతో ఊగిపోతున్న ఆ యువతి ఏకంగా పైకి గెంతుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈలోగా తాను ప్రభాస్ ను టచ్ చేయాలన్న కోరిక పుట్టిందో ఏమో.. వెంటనే ఆ యువతి ప్రభాస్ చెంపపై సుతారంగా కొట్టింది. ప్రభాస్ ఆమె చర్యకు.. కొంత విస్మయం చెందిన ప్రభాస్ అభిమానులంటే ఇలాంటి వారూ వుంటారు అనుకున్నాడు. అంతలో ఆ యువతితో ఉన్న యువకుడు కూడా ప్రభాస్ తో ఫొటో దిగాడు. మొత్తానికి ఆ అమ్మాయి మాత్రం తనకు దక్కిన అదృష్టానికి విపరీతంగా పొంగిపోయింది. వాళ్లిద్దరే కాదు వాళ్ల స్నేహబృందంలోని మరికొందరు కూడా ప్రభాస్ తో గ్రూప్ ఫొటో దిగి పట్టలేని సంతోషం సొంతం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Baahubali  Saaho  Shraddha Kapoor  US airport  Young fan  tollywood  

Other Articles