Indian short documentary wins Oscar ఇండియన్ ‘ఫిరియడ్’కు ఆస్కార్.. డాక్యూమెంటరీ నూతనోద్యాయం..

Netflix s indian short documentary period end of sentence wins oscar

menstruation, rural India, Period. End of Sentence, Oscar, Oscars, Documentary Short Subject, Netflix, 91st Academy Awards, Academy Awards, Rayka Zehtabchi, Guneet Monga, Sikhya Entertainment, tollywood, movies, entertainment

A film on menstruation, set in rural India, titled Period. End of Sentence, has won the Oscar in the Documentary Short Subject category at the 91st Academy Awards. Award-winning filmmaker Rayka Zehtabchi has directed the short film, which has been produced by Indian producer Guneet Monga's Sikhya Entertainment.

ఇండియన్ ‘ఫిరియడ్’కు ఆస్కార్.. డాక్యూమెంటరీ నూతనోద్యాయం..

Posted: 02/25/2019 11:54 AM IST
Netflix s indian short documentary period end of sentence wins oscar

అత్యంత ప్రతిష్టాత్మకమైన అస్కార్ అవార్డును భారతదేశానికి లభించింది. వందేళ్లకు పైగా చరిత్రకలిగిన ఇండియన్ సినిమాలు అనేకం ఇన్నాళ్లుగా అస్కార్ నామినేషన్ల వరకు వెళ్లినా.. తొలిసారిగా ఒక భారతీయ డాక్యుమెంటరీకి అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని చరిత్రలో నూతనోద్యాయాన్ని లిఖించింది. ఈ డాక్యూమెంటరీ అస్కార్ అవార్డును సాధించిన క్రమంలో దేశంలోని వివిధ చలనచిత్ర పరిశ్రమల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా, రేకా జెహతాబ్చి దర్శకత్వంలో నిర్మించిన ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’ అస్కార్ న్యాయనిర్ణేతల మనసు చూరగొని అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో జరుగుతున్న 91వ ఆస్కార్‌ వేడుకల్లో అవార్డు సొంతం చేసుకుంది. భారత దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆడపిల్లలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు మోంగా ఇచ్చిన దృశ్య రూపమే ‘పీరియడ్‌’. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ చిన్న డాక్యుమెంటరీని తొలిసారిగా భారత్ కు అస్కార్ అవార్డును తీసుకువచ్చింది.

చిన్న డాక్యుమెంటరీతో భారతీయ చిత్ర పరిశ్రమ కీర్తిప్రతిష్టలను ఆస్కార్‌ వరకు తీసుకు వెళ్లిన నిర్మాత, దర్శకులు గునీత్మెంగా, రేకా జెహతాబ్చిలను భారత్ చిత్రపరిశ్రమ హాట్సాప్ పలికింది. పలు భారతీయ చిత్రాలు అస్కార్ వరకు వెళ్లి అక్కడ నామినేట్‌ కావడమే తప్ప అవార్డుకు మాత్రం అందుకున్న దాఖలాలు లేవు. అటువంటిది ఓ డాక్యుమెంటరీకి అత్యున్నత పురస్కారం లభించడం భారత చలనచిత్ర రంగానికే కొత్త అందాన్ని, కీర్త ప్రతిష్టలను తీసుకువచ్చిందని, ఇది చారిత్రాత్మకమని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీలో ఆ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్‌ నాప్ కిన్లు ఎలా తయారు చేస్తారు, వాటిని అతి తక్కువ ధరకు అమ్ముతూ ఇతరులకు ఎలా సాయపడతారు’ అన్నదే ఈ డాక్యుమెంటరీ కథ. అవార్డు ప్రకటించగానే ‘ఓ మైగాడ్‌.. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యపై నేను డాక్యుమెంటరీ తీస్తే ఆస్కార్‌ అవార్డు వచ్చింది. నా అనందాన్ని మాటల్లో చెప్పలేను’ అంటూ దర్శకురాలు రేకా జెహతాబ్చి ఉద్వేగానికి లోనయ్యారు. అవార్డు సమాచారం అందగానే ‘మనం గెలిచాం. ఈ భూమ్మీదున్న ప్రతి ఆడపిల్ల తనను తాను ఓ దేవతలా భావించాలి’ అంటూ నిర్మాత గునీత్‌ మోంగా ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : menstruation  rural India  Period. End of Sentence  Oscar  91st Academy Award  Entertainment  

Other Articles