tollywood direrctor kodi Rama Krishna no more ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ ఇకలేరు..

Tollywood direrctor kodi rama krishna passed away

tollywood direrctor kodi Rama Krishna, direrctor kodi Rama Krishna, kodi Rama Krishna passed away, kodi Rama Krishna no more, kodi Rama Krishna dies, kodi Rama Krishna AIG hospital, kodi Rama Krishna dead, kodi Rama Krishna, paralysis, movies, entertainment, tollywood

Popular tollywood direrctor kodi Rama Krishna is no more, He had passed away today while under going treatment in Gachibowli AIG Hospital for lung infection. He had fallen critically ill yesterday, and Family members rushed him for treatment, He had been awarded state governments nandi awards for ten times.

దశనందుల దర్శకుడు కోడిరామకృష్ణ కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

Posted: 02/22/2019 04:05 PM IST
Tollywood direrctor kodi rama krishna passed away

ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ ఇక లేరు. క్రితం రోజున తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ప్రైవేటు అస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు గచ్చీబౌలీలోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడే చికిత్స పోందుతున్న ఆయన అరోగ్యం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడంతో అరోగ్యం మరింత క్షీణించి ఇవాళ మధ్యహ్నం మరణించారు. గతంలో పక్షవాతం వచ్చినప్పటి నుంచి నయం అయిన తరువాత కూడా ఆయన అరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో సినిమా పరిశ్రమకు ఆయన దూరంగానే వున్నారు.

కాగా ఇవాళ మధ్యహ్నం అస్పత్రిలోనే చికిత్స పోందుతున్న ఆయన అరోగ్యం పూర్తిగా విషమించి మరణించారు. కోడి రామకృష్ణ మరణవార్త నేపథ్యంలో తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వెండితెరపై తనదైన శైలిలో భిన్న కథాంశాలతో చిత్రాను రూపోందించిన ఆయన.. ఏకంగా పది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డలను అందుకున్నాడు.

తెలుగు తెరపై కుటుంబ కథా చిత్రాలను, రాజకీయ నేపథ్యమున్న చిత్రాలను, ఆధ్యాత్మిక చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో దర్శకుడిగా ఆయన పరిచయం జరిగింది. మధ్యతరగతి జీవితాలను .. అందులోని ఒడిదుడుకులతో పాటు రాజకీయాలపై కూడా తనదైన శైలిలో చిత్రాలను రూపోందించి.. ప్రజలను జాగృత పర్చాడు.

తన చిత్రాల ద్వారా నిత్యం ప్రేక్షకులను మెప్పించారు. ఫాంటసీ చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. 'అమ్మోరు' .. 'అరుంధతి' సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఎలాంటి స్టార్ హీరోలు, నటులు లేకున్నా దేవుళ్లు చిత్రాన్ని రూపోందించి ఘనవిజయాన్ని అందుకునేలా చేసిన మార్కు కోడి రామకృష్ణది. మెగాస్టార్ నటించిన ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య చిత్రం నుంచి ఆయన దర్శక ప్రస్థానం ప్రారంభమైంది.

టాలీవుడ్ లో పలు సంచలన విజయాలను సాధించిన చిత్రాలను అందించాడు కోడిరామకృష్ణ. నందమూరి బాలకృష్ణ , డాక్టర్ రాజశేఖర్ , సుమన్  లు నటించిన పలు బ్లాక్ బస్టర్  చిత్రాలకు దర్శకత్వం వహించాడు కోడిరామకృష్ణ. ఈ హీరోలతోనే కాకుండా నాగార్జున , వెంకటేష్ , మోహన్ బాబు , వినోద్ కుమార్ తదితర హీరోలతో కూడా పలు సూపర్ హిట్స్ తీసాడు. కోడిరామకృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులు ప్రార్థనలు భగవంతుడు అలకించినట్లు లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodi Rama Krishna  passed away  no more  AIG hospital  director  tollywood  

Other Articles