AMB follows GST norms, no notices served: Sunil Narang ఏఎంబి సినిమాస్ పై ఆ వార్తల్లో నిజం లేదు: సునీల్ నారంగ్

Mahesh babu amb follows gst norms no notices served sunil narang

mahesh babu theater, mahesh babu multiplex rates, mahesh babu multiplex, Mahesh Babu AMB Cinemas, Sunil Narang, Asian Cinemas MD, Mahesh Babu, amb cinemas, mahesh babu, AMB Cinemas, multiplex rates, GST norms, AMB tickets price, revised tax rates, GST notices, crime

AMB Cinemas Managing Director Sunil Narang says, show cause notice by GST officials are baseless rumours. He also said that they strictly follow GST norms based on revised tax rates.

ఏఎంబి సినిమాస్ పై ఆ వార్తల్లో నిజం లేదు: సునీల్ నారంగ్

Posted: 02/20/2019 08:27 PM IST
Mahesh babu amb follows gst norms no notices served sunil narang

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ వాణిజ్యరంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో మహేష్ ఏడు స్ర్కీన్లతో సూపర్ ప్లెక్స్ నిర్మించి.. ఏషియన్ సినిమాస్ తో సంయుక్తంగా ఏఎంబి సినిమాస్ పేరుతో ఈ సినీవ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ‘ఏయంబీ సినిమాస్‌’ను వివాదం చుట్టేసింది. కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ కౌన్సిల్ నిబంధనలను పాటించకుండా పాత ధరలతో ప్రేక్షకుల నుండి అదనపు పన్నులను వసూలు చేస్తుండటంతో ‘ఏయంబీ సినిమాస్‌’‌కి నోటీసులు అందినట్టు వార్తలు వచ్చాయి.

ఈ వివాదంపై ఏషియన్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ స్పందిస్తూ.. ఏఎంబీ సినిమాస్ కు షోకాజ్ నోటీసులు అందాయని వస్తున్న వార్తలు సత్యదూరమని చెప్పారు. తాము కొత్త జీఎస్టీ నిబంధనలను అమలు చేస్తున్నా.. ఈ వార్తలు ఎవరు కల్పించారో తెలియదని చెప్పారు. అధికారులు తమ సూపర్ ప్లెక్స్ కు వచ్చిన మాట నిజమేనని, వారు రికార్డులు పరిశీలించి వెళ్లారని తెలిపారు. తమ మల్టీఫెక్స్ లో జీఎస్టీ తగ్గించే టికెట్లు విక్రయిస్తున్నామని చెప్పారు.

ఈ విషయాన్ని పరిశీలించిన అధికారులు అన్ని పరిశీలించిన పిమ్మట వెనుదిరిగారని చెప్పారు. అయితే పెనాల్టీ కట్టాలని అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు. నోటీసులు ఇచ్చారని వచ్చిన వార్తల గురించి తెలుసుకుని జీఎస్టీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారని సునీల్ అన్నారు. ఏఎంబీ సినిమాస్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయదని, వినియోగదారులకు అధునాతన అనుభూతిని కల్పించడంతో పాటు వారికి సరసమైన ధరలకే వినోదాన్ని అందించడం ఏషియన్ సినిమాస్ ధ్యేయమని సునీల్ నారంగ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  AMB Cinemas  multiplex rates  GST  Sunil Narang  Asian Cinemas  Tollywood  

Other Articles