Suhana Khan wants to date this global star సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

Suhana khan reveals the actor she wants to date this celebrity

Suho, EXO Band, Kim Jun-myeon, Shah Rukh Khan, South Korean singer, Suhana Khan, Suhana Khan pictures, Suho, movies, entertainment, bollywood, tollywood

Shah Rukh Khan’s daughter Suhana replied with a photo of South Korean singer, songwriter and actor Suho, lead singer of the boy band Exo when asked by a fan, “Actor you wanna date?" Suho’s real name is Kim Jun-myeon.

సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

Posted: 02/18/2019 05:47 PM IST
Suhana khan reveals the actor she wants to date this celebrity

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్ పరిశ్రమతో పాటు అభిమానులకు కూడా తెలిసిందే. ఆ మధ్య ఓ ఫిల్మ్ మ్యాగజీన్ కోసం అమె ఫోటో షూట్ చేయడంతో సినీ ప్రస్తానం మొదలుకాకుండానే మ్యాగజీన్ కవర్లపై ఫోటోలంటూ విమర్శలు ఎదురైన తరువాత తాజాగా అమ్మడు మరోమారు వార్తల్లో నిలిచింది.

ఔన్.! ఎందుకోసం అంటారా.. తాజాగా ఈ 18 అణాల అమ్ముడు తన మనస్సులో వున్న విషయాన్ని ఏ మాత్రం జంకుబొంకు లేకుండా నిర్భయంగా చెప్పడమే ఇందుకు కారణం. అంతేకాదు.. అందుకుగల ఫోటోను కూడా విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుహానాను బాలీవుడ్ లో భారీ ఎత్తున లాంచ్ చేయనున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో ఆమె ఇప్పటికే సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఆమెకు ఎంతో మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ క్రమంలో అమె సామాజిక మాద్యమం ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ తరుణంలో సుహానాకు ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ డేటింగ్ చేయాలనుకుంటే మీరు ఎవరితో డేటింగ్ చేస్తారు? అని ఓ అభిమాని ఆమెను ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా... 'దక్షిణ కొరియా సింగర్, యాక్టర్ సుహోతో డేటింగ్ చేయాలనుకుంటున్నా' అని తెలిపింది. అంతే కాదు సుహో ఫొటోను కూడా షేర్ చేసింది. సుహో అసలు పేరు కిమ్ జున్ మియాన్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suho  Kim Jun-myeon  South Korean singer  Suhana Khan  Shah Rukh Khan  bollywood  

Other Articles