jagapati babu about his bad time ‘‘పూల పాన్పులపై నడిచిన చోట.. పరాభవాలు’’

Jagapathi babu about his bad period in film industry

Jagapati Babu, family hero, yester years Hero, Popular actor, sye raa, veera reddy, producers, bad time, bad period, film industry, set backs in tollywood, tollywood, movies, entertainment

yester years hero, present Popular actor Jagapati Babu reveals about his bad period in film industry, in an interview to a tv channel, where producers were wantedly ignoring him.

‘‘పూల పాన్పులపై నడిచిన చోట.. పరాభవాలు’’

Posted: 02/13/2019 07:34 PM IST
Jagapathi babu about his bad period in film industry

సినీ పరిశ్రమలో స్టార్ గా ఎదగాలంటే ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. అందుకనే హీరోలు.. తమకు దర్శకులు చెప్పిన కథలలో పలు మార్పులు చేయమని సూచిస్తుంటారు. ఆ తరువాతే వారి కథలకు అమోదముద్ర వేస్తారు. అయితే కథలో మార్పులు చేయకుండా ఇతర హీరోలతో రూపోందించిన చిత్రాలు ఒక్కోసారి మంచి హిట్ లను కూడా సాధిస్తాయి. ఇలా కొన్ని అద్భుతమైన కథలు ఒక హీరో చేజారి మరో హీరోకు వరంగా మారుతుంటాయి.

అయితే ఒక స్టార్ నిలదొక్కుకోవడం పూర్తిగా దర్శకుడి ప్రతిభ, కథ, కథనం, టేకింగ్ లో వైవిధ్యంపైనే ముడిపడి వుంటుందన్నది కాదనలేని సథ్యం. కానీ వారి లక్కు బాగోలేకపోతే అది హీరోలకు శాపంగా మారుతుంది. లక్కు కలసిరాకపోయినా.. దర్శకత్వ శాపమైన.. వరుసగా మూడు నాలుగు సినిమాలు బోల్తా కొట్టాయంటే ఇక ఆ హిరోకు రెడ్ కార్పెట్ పరిచిన చోటే.. కుర్చీలు కూడా వుండవు.. ప్రత్యేక పలహారాలు పెట్టినవారే కనీసం బోజనం కూడా పెట్టరు. అందుకనే అది మాయా ప్రపంచం.. రంగురంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏ రంగులో నిలుస్తారో తెలియదు.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకని అంటారా.? ఇది ఒకనాటి ఫ్యామిలీ హారోగా ముద్రపడిన విలక్షణ నటుడికి ఎదురైన అనుభవం. ఆయన వస్తుంటే నిర్మాతలు చూసి చూడకుండా తప్పుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. హీరోగా నిలదొక్కుకున్న క్రమంలో తనకు పూల పాన్పులు పరిచిన అదే చిత్రపురిలో తనకు బ్యాడ్ టైం ఎదురుకాగానే అనేక చేధు అనుభవాలు కూడా ఎదురయ్యాయని ఆయన తనకు గతం మిగిల్చిన గాయలను చెప్పుకోచ్చారు. ఇంతకీ ఆయన ఎవరంటారా.? అయనే విలక్షణ నటుడు జగపతిబాబు.
 
ఒకటి రెండు సినిమాల తర్వాత.. డబ్బు వస్తే సరిపోయింది.. లేకుంటే నువ్వెవరో నేనేవరో అనేలా వ్యవహరిస్తారు. అసలు తనకు తిండి కూడా పెట్టని నిర్మాతలు వున్నారు. సెట్‌లో కుర్చీ ఇవ్వని ప్రొడ్యూసర్లూ ఉన్నారు. కొన్ని ఎక్స్‌పెరిమెంట్లు కూడా చేశాను. పస్తువుంటే ఏమౌతుందని మూడు రోజులు పస్తుండిపోయానని జగపతి బాబు తెలిపారు. తనకు అవకాశం వస్తుందని ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ పట్టుకు తిరిగేవాడిని చెప్పుకోచ్చారు. అలాంటి సమయంలో తానంటే తనకే కోపం వేసిందన్నారు.

ఓ రోజు ఇంటి గేటు ఓపెన్ అయ్యింది. ఆటోలో వెళ్తూ వెళ్తూ.. సినిమా తీద్దామనుకుంటున్నా.. నిర్మాత, దర్శకుడు, హీరో తానే అన్నాడు. మరి తన సంగతేంటి అంటే ఓ క్యారెక్టర్ అన్నారు. అప్పట్లో తానంటే అంత చులకనగా వుండేదని జగపతిబాబు చెప్పాడు. అయితే డిజైనర్‌ రామ్‌ ఫొటో సెషన్‌ తనకు బాగా సహకరించింది. ఆ ఫొటో బయటికి వెళ్లడం, బోయపాటి శ్రీను ''లెజెండ్'' కోసం అడగడం జరిగాయి. వారం పది రోజులు వాళ్లు డిలే చేశారు. తనకు టెన్షన్ మొదలైంది.

వాళ్లకేమో తాను విలన్‌గా చేస్తానో చేయనోనని టెన్షన్‌. మొత్తానికి వాళ్లొచ్చారు. తాను అనుకున్న దానికంటే ఎక్కువే పారితోషికం ఇచ్చారు. కేవలం తన మీదున్న అభిమానంతో అనుకున్న దానికంటే డబుల్‌గా డబ్బిచ్చారు. ''లెజెండ్‌'' సినిమా చేసేటప్పుడు అర్ధరాత్రిళ్లు లేచి ఏడ్చేసేవాడిని. తానేంటి ఇంత క్రూరంగా వుంటానా అని ఏడుపు వచ్చేది. కానీ హీరో నుంచి విలన్‌గా మారినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ లేదని.. అప్పుడే తాను ఓ నటుడిని అనే ఫీలింగ్ కలిగిందని జగపతిబాబు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapati Babu  family hero  sye raa  veera reddy  producers  bad time  tollywood  

Other Articles