Telugu director Vijaya Bapineedu is no more ప్రముఖ దర్శకనిర్మాత విజయబాపినీడు ఇక లేరు..

Acclaimed telugu director vijaya bapineedu passes away

vijaya bapineedu movie, tollywood director vijaya bapineedu, tollywood producer vijaya bapineedu, bapineedu passed away, vijaya bapineedu, gutta bapineedu chowdary, chiranjeevi, ,aspiring filmmakers, movies, entertainment, tollywood

Renowned director Gutta Bapineedu Chowdary, popularly known as Vijay Bapineedu breathed his last on Tuesday in the city. He was 86 years old. The veteran filmmaker helmed his first film ‘Dabbu Dabbu Dabbu’ in 1981.

ప్రముఖ దర్శకనిర్మాత విజయబాపినీడు ఇక లేరు..

Posted: 02/12/2019 11:02 AM IST
Acclaimed telugu director vijaya bapineedu passes away

ప్రముఖ సినీ దర్శక నిర్మాత విజయ బాపినీడు ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని తన స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 82 ఏళ్లు. ఇండస్ట్రీకి రాకముందు కొంతకాలం పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్లో పనిచేశారు. ఆ తరువాత విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. ఇటు చలనచిత్రరంగంలోకి ప్రవేశించి.. తన సినిమాలకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు.

1981లో డబ్బు, డబ్బు, డబ్బు చిత్రంతో మెగాఫోన్ పట్టుకున్న ఆయన దర్శకుడిగా మారారు. మెగాస్టార్ చిరంజీవి, అంధ్రుల అందాలనటుడు శోభన్ బాబు వంటి ప్రముఖ హీరోలతో సినిమాలు నిర్మించారు. అప్పట్లో చిరంజీవి, బాపినీడు కాంబినేషన్ అంటే కచ్చితంగా సినిమా హిట్ అనే టాక్ వుంది. చిరంజీవితో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగ మహారాజు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘మగధీరుడు’ ‘గ్యాంగ్ లీడర్’, ‘బిగ్ బాస్’ సినిమాలతో పాటు మెగాస్టార్ వందో చిత్రం ‘ఖైదీ నంబర్ 786’ను కూడా విజయ బాపినీడే తెరకెక్కించారు.

వీటితో పాటు సుమంగళి, వాలుజడ తోలు బెల్టు, కారు దిద్దిన కాపురం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు బాపినీడు దర్శకత్వం వహించారు. 1976 నిర్మించిన యవ్వనం కాటేసింది అనే సినిమాకు బాపినీడు నిర్మాతగా మారారు. చిరంజీవి తరువాత నవ్వుల కిరీటీ, హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్‌తో బాపినీడు అత్యధిక సినిమాలు తెరకెక్కించారు. క్రిష్ణ, మోహన్‌బాబు వంటి సీనియర్ నటులతోనూ ఆయన కలసి పనిచేశారు. దర్శకుడిగా 22 సినిమాలు తెరకెక్కించిన బాపినీడు.. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘యవ్వనం కాటేసింది’ సినిమాను నిర్మించారు. అలాగే స్నేహితులతో కలిసి మరో 12 చిత్రాలను నిర్మించారు.

సెప్టెంబర్ 22 , 1936లో సీతారామ స్వామి, లీలావతి దంపతులకు ...పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు. ఏలూరు సీఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నారు. మరోవైపు బాపినీడు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగింది. ఆయన మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖులంతా బాపినీడు మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Renu desai re entry with bellamkonda sai srinivas film

  యాక్షన్ హీరో చిత్రంతో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

  Feb 19 | తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, పవన్ తో వివాహమైన తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు.... Read more

 • Vijay devarakonda to play father role

  అర్జున్ రెడ్డి సాహసం.. తండ్రిపాత్రలో తొలిసారి..

  Feb 19 | విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సింగరేణి కార్మికులకు... Read more

 • Srinivas avasarala plays lead role in nayana rara intiki

  ‘‘నాయనా..! రారా ఇంటికి’’ చిత్రం హీరోగా అవసరాల..

  Feb 18 | అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ... Read more

 • Nani s upcoming film with vikram k kumar gets launched officially

  నాని నెక్ట్స్ మూవీలో.. ఆ హీరోనే విలన్

  Feb 18 | నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన... Read more

 • Suhana khan reveals the actor she wants to date this celebrity

  సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

  Feb 18 | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్... Read more

Today on Telugu Wishesh