Naga Babu Daughter Niharika Wedding buzz తండ్రి బాధ్యతను తీర్చుకునే పనిలో నాగబాబు

Naga babu spilled beans about niharika s wedding

nagababu, niharika, marriage, cinema, series, anchor, chiranjeevi, Pawan Kalyan, varun tej, Ram Charan, Sai dharam tej, movies, entertainment, tollywood

Niharika Konidela is the promising heroine in Tollywood film industry who is trying to make her mark by choosing films of her age. If we find a suitable guy in our community, we will get her married to him or I am okay to pick a guy from other communities as well. Her father Naga Babu

తండ్రి బాధ్యతను తీర్చుకునే పనిలో మెగా బ్రదర్ నాగబాబు

Posted: 02/11/2019 09:44 PM IST
Naga babu spilled beans about niharika s wedding

తనపై ఉన్న బాధ్యతను తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు సీనియర్ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు. తన సంతానమైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చక్కగా రాణిస్తున్న క్రమంలో.. తన కూతురు నిహారిక కూడా అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా సిరీస్ తో పాటు యాంకర్ గా కూడా రాణించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తనపై వున్న బాధ్యతలేంటి అంటే.. ముందుగా నిహారిక పెళ్లి.. ఆ తరువాత వరుణ్ తేజ్. ఈ క్రమంలో తన కుమార్తె నిహారిక పెళ్లి చేసేందుకు మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నామని నాగబాబు అన్నారు.

నిహారికకు నటించడం అంటే ఇష్టమని.. చెప్పుకోచ్చిన ఆయన.. ఆమె యాంకర్ గా రాణించి.. తరువాత సినిమాలు చేయడం, ఆ తరువాత సామాజిక మాధ్యమాల్లో సిరీస్ ద్వారా కూడా నటించి మంచి పెరు తెచ్చుకుందని చెప్పారు. నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ అనుకున్నంత బాగా ఆడలేదు. తర్వాత తమిళంలో నటించింది, అది ఫర్వాలేదు. మూడో సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్‌’. అదీ పెద్దగా ఆడలేదు అని అన్నారు.

ఓ పక్క సినిమాలు చేస్తూనే మధ్యలో ‘ముద్దపప్పు’ సిరీస్‌లో నటించింది. అది సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు ‘సూర్యకాంతం’ అనే సినిమా చేస్తోంది. ఆడపిల్లని నటనకు పంపాలా? వద్దా? అనుకుంటున్నప్పుడు తను.. ‘నేను నటిస్తా నాన్నా. సరైన కథలు ఎంచుకుంటాను. కుటుంబంలో మొత్తం నటులు ఉన్నప్పుడు నటించాలని నాకు ఎందుకు ఉండదు’ అంది. సరే అని ఒప్పుకున్నా. తనకు నేను ముందే చెప్పా రెండు, మూడేళ్ల తర్వాత పెళ్లి చేస్తానమ్మా అని.. సరే ననిందని చెప్పారుజ

అయితే అల్లుడు ఎవరని ఇంకా ఏమీ అనుకోలేదు. సంబంధాలు వెతుకుతున్నాం. సినీ రంగం నుంచే కావాలనే ఆంక్షలు ఏమీ లేవు. మంచి గుణాలు, పద్ధతి ఉన్న కుర్రాడైతే చాలు. కుటుంబ నేపథ్యం కూడా బాగుండాలి. నాకు కులం, మతంతో పెద్ద పట్టింపులు లేవు. 2018 వరకు అమ్మాయికి టైమ్‌ ఇచ్చా. 2019 వచ్చింది.. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేస్తా’ అని నాగబాబు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagababu  niharika  marriage  cinema  series  anchor  tollywood  

Other Articles