Ram Charan paysback Rs 5Cr to danayya డిస్ట్రిబ్యూటర్లను అదుకోవడంలో తన వంతుగా రాంచరణ్

Ram charan paysback rs 5cr to compensate vvr losses

vinaya vidheya rama, Ram charan, danayya, boyapari srinu, losses, buyers, movies, war of word between danayya and boyapati, vinaya vidheya rama losses, entertainment, tollywood

To compensate the losses of Vinaya Vidheya Rama, producer danayya reportedly asked Ram Charan and Boyapati to return 5 crores from their remunerations. Ram Charan immediately accepted but Boyapati is said to have resisted.

డిస్ట్రిబ్యూటర్లను అదుకోవడంలో తన వంతుగా రాంచరణ్

Posted: 02/07/2019 07:24 PM IST
Ram charan paysback rs 5cr to compensate vvr losses

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన ‘విన‌య విధేయ రామ’ సంక్రాంతికి వ‌చ్చి దారుణంగా నిరాశ ప‌రిచింది. ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మెగా అభిమానులు షాక్ తిన్నారు. చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేసింది ఈ చిత్రం. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 30 కోట్ల వ‌ర‌కు విన‌య విధేయ రామ న‌ష్టాలు తీసుకొచ్చింది. దాంతో ఇప్పుడు ఈ న‌ష్టాల‌ను ఎవ‌రు భ‌రిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఒక‌టి రెండు కోట్లు నష్టం వస్తే డిస్ట్రిబ్యూటర్లు సైతం పెద్దగా పట్టించుకోరు కానీ.. ఏకంగా 30 కోట్లు కావడంతో బ‌య్య‌ర్లు కూడా భ‌య‌ప‌డుతున్నారు. దీంతో బయర్లుకు అండగా నిలిచేందుకు కూడా మెగా పవర్ స్టార్ రెడీ అయ్యాడు. బయర్లకు అండగా నిలబడి ధైర్యం ఇచ్చే భాద్యతను కూడా తీసుకున్న రాంచరణ్... వారిని ఆదుకునే కార్య‌క్ర‌మం కూడా త‌ానే తీసుకుంటున్నాడు. వ‌చ్చిన 30 కోట్ల న‌ష్టాల్లో తాను క‌నీసం 15 కోట్లు వెన‌క్కివ్వాల‌ని నిర్మాత‌తో క‌లిసి డిస్క‌స్ చేసి ఓ నిర్ణ‌యం తీసుకున్నాడు చ‌ర‌ణ్.

ఇదే విష‌యంపై చ‌ర‌ణ్ కూడా మొన్నా మ‌ధ్య ఓ లేఖ విడుద‌ల చేసాడు. నైజాంలో దాదాపు దిల్ రాజుకు ఈ చిత్రం 7 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు తీసుకొచ్చింది. దాంతో పాటు ఆంధ్రాలో కూడా 18 కోట్ల‌కు పైగానే ముంచేసింది. ఇక ఓవ‌ర్సీస్ ఆరున్నర కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో దానయ్యతో కలసి చర్చించిన రాం చ‌ర‌ణ్ తన వంతుగా ఐదు కోట్ల రూపాయలను దానయ్యకు ఇచ్చేశాడు. మ‌రి మిగిలిన 10 కోట్లు నిర్మాత దాన‌య్య ఇస్తాడా లేదంటే బోయ‌పాటి, దాన‌య్య క‌లిసి ఇస్తారా.? అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vinaya vidheya rama  Ram charan  danayya  boyapari srinu  losses  buyers  Tollywood  

Other Articles