winking girl priya prakash lovers day song out ప్రియా ప్రకాష్ ‘లవర్స్ డే’ పాట అదిరిందహో..!

Priya prakash freak pilla song video song out from lovers day movie

Priya Prakash Varrier, Lovers Day Movie Song, Freak Pilla Full Video Song, Shaan Rahman, Roshan Abdul Rahoof, Noorin Shereef, Omar Lulu, allu arjun, Vinod Reddy, tollywood, movies, entertainment

The winking Sensation, Malayalam actor Priya Prakash Varrier malayalam movie is ready to hit screens in telugu with title lovers day on feb 14th, the unit released freak pilla video song today.

‘కన్నుగీటు పిల్ల’ ప్రియా ప్రకాష్ ‘లవర్స్ డే’ పాట అదిరిందహో..!

Posted: 02/05/2019 04:35 PM IST
Priya prakash freak pilla song video song out from lovers day movie

ఒక్క రోజులో సెలబ్రిటీ కావాలని, ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ రావాలని ఎవరు మాత్రం కలగనరూ.. అయితే అందుకు కూడా అదృష్టం వుండాలి. మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్కసారి కన్నుగీటి యావత్ దేశయూవత హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. దీంతో అమెకు వచ్చిన క్రేజ్ ఎలాంటిదో చెప్పనలవి కాదు. ఆమె నటించిన చిత్రం విడుదలకు కూడా నోచుకోకముందే అమెకు పెద్ద స్టార్ డమ్ వచ్చి చేరింది.

అమె కన్నుగీటకు ఎన్నో స్కూప్ లు, సైటర్లు ఇలా చాలానే వచ్చాయి. ఎంతలా అంటే చివరకు అమె రాజకీయ నాయకులను కూడా బేరిజువేసేలా. మాలీవుడ్ లో ఒమర్ లులు దర్శకత్వంలో ఆమె 'ఒరు ఆదార్ లవ్' అనే సినిమాను చేసింది. షాన్ రెహ్మాన్ ఈ సినిమాకి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.

'వాలెంటైన్స్ డే' సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఓ మైగాడ్ పోయా ..' అంటూ ఈ సాంగ్ మొదలవుతోంది. కాలేజ్ క్యాంపస్ లో స్టూడెంట్స్ పై చాలా కలర్ ఫుల్ గా ఈ సాంగ్ ను చిత్రీకరించారు. జోరుగా .. హుషారుగా కొనసాగుతోన్న ఈ సినిమా, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలానే వుంది. ఇక ప్రియా క్రేజ్ ఈ సినిమాకి ఏ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priya Prakash Varrier  Lovers Day  Freak Pilla  Shaan Rahman  Omar Lulu  tollywood  

Other Articles