Actor Sathiyaraj clarrifies on his arrest news కటకటాల వెనక్కి కట్టప్ప.. నిజమేంటంటే..!

Actor sathiyaraj clarrifies on his arrest news

Actor Sathiyaraj, Actor Sathiyaraj clarrifies on arrest, sathyaraj balu, sathyaraj balu mdmk,mdmk functionary,mdmk member sathyaraj balu arrested,mdmk member sathyaraj balu booked,prime minister narendra modi,narendra modi,pm modi,prime minister,defamatory post, Crime, movies, entertainment, tollywood

Sathyaraj Balu, MDMK functionary from Nagapattinam, was arrested for defamatory social media post against PM Modi. But Rumours doing rounds that Actor Sathiyaraj was arrested.

కటకటాల వెనక్కి కట్టప్ప.. నిజమేంటంటే..!

Posted: 01/30/2019 09:55 PM IST
Actor sathiyaraj clarrifies on his arrest news

తనకు ఎవరో పంపిన ఓ ఫొటోను పోస్టు చేసి, తీవ్ర విమర్శలపాలై, అరెస్టై, రిమాండ్ ఖైదీగా కూడా ఓ రోజును జైలు గోడల మధ్య గడిపాడంటూ కథనాలు వస్తున్న వేళ.. తన అరెస్టు వార్తల విషయమై స్పందించాడు సత్యారాజ్. బాహుబలి సినిమాలో ‘కట్టప్ప’గా నటించి యావత్తు సినీ లోకాన్ని ఆకట్టుకున్న ప్రముఖ నటుడు సత్యరాజ్.. తన అరెస్టు విషయంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు.

ఇక సత్యరాజ్ అన్న పేరు వుండగానే అది తానేనంటూ సోషల్ మీడియా కోడై కూస్తోందని, ఇక మరికొందరు సామాజిక మాధ్యమాల్లో తాను జైలు గోడల మధ్య నరకం అనుభవించానని, తొలిరోజును జైలులో నిద్రలేకుండా గడిపానని కూడా పోస్టులు పెట్టారన్నారు. నిజానికి తాను వేరు అరెస్టయిన సత్యరాజ్ వేరని అయన తెలిపారు. తాను నటుడ్ని అని, అయితే ఎండీఎంకే నాగపట్టణం జిల్లా ఇన్ చార్జ్‌ సత్యరాజ్‌ తాను కాదని వివరణ ఇచ్చుకునేలా చేసింది సోషల్ మీడియా.

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనను వ్యతిరేకిస్తూ, ఆయన ఓ చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నట్టు ఉన్న ఫొటోను సత్యరాజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వ్యంగ్య చిత్రాన్ని ఆయన, 26న పోస్ట్ చేయగా, ఇది వైరల్ గా మారింది. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోచ్చారు సత్యరాజ్. తాను అరెస్టయ్యానంటూ తన అభిమానులను గంధరగోళానికి గురిచేయవద్దని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Sathiyaraj  sathyaraj balu  mdmk  social media  defamatory post  kollywood  tollywood  crime  

Other Articles