I want to be a pan-Indian actress: Kiara Advani నా తొలి మాస్ కమర్షియల్ చిత్రం ఇదే: కైరా అద్వాని

Kiara advani calls vinaya vidheya rama heightened reality

Vinaya Vidheya Rama, Ram Charan, Kiara Advani, Sneha, Prashanth, Vivek Oberoi, Boyapati Srinu, devisri prasad, DVV Danayya, movies, entertainment, tollywood

young heroine Kiara Advani said, she "always wanted to be this ‘mass heroine’ doing dance numbers, and I got to do a lot of that in VVR. My love for dancing was expressed in VVR.”

నా తొలి మాస్ కమర్షియల్ చిత్రం ఇదే: కైరా అద్వాని

Posted: 01/04/2019 08:42 PM IST
Kiara advani calls vinaya vidheya rama heightened reality

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి పండుగ బరిలో నిలిచేందుకు సిద్దంగా వుంది. భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన బాలీవుడ్ భామ కైరా అద్వాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. జనవరి 11వ తేదీన 'వినయ విధేయ రామ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సుందరి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో 'రామ' పేరుతో చరణ్ కనిపిస్తే .. 'సీత' పేరుతో నేను కనిపిస్తాను. కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో సంప్రదాయ బద్ధంగా కనిపిస్తాను. చరణ్ కి .. నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందనే టాక్ మాత్రం తప్పనిసరిగా వస్తుంది. ఈ సినిమాలో 'రామ లవ్స్ సీత' అనే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం.

ఈ పాటలో నేను, చరణ్ చాలా బాగా డాన్స్ చేశాము. చరణ్ మంచి డాన్సర్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. అలాంటి చరణ్ .. నాతో డాన్స్ చేయడం అంటే ఇష్టం అని చెప్పినప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రం తనకు తొలి మాస్ కమర్షియల్ చిత్రం అని ఇది తప్పక విజయం సాధిస్తుందని కూడా అమె ధీమా వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Vinaya Vidheya Rama  Ram Charan  Kiara Advani  dance  tollywood  

Other Articles

Today on Telugu Wishesh