Upasana prepares fish curry for Ram Charan రాంచరణ్ లోకేషన్లో చేపలకూర వండిన ఉపాసన

Upasana konidela prepares fish curry on vvr location from ram charan diet

Ram Charan wife Upasana fish curry, Ram Charan diet, Ram Charan wife Upasana, Ram Charan Upasana videos, Ram Charan Upasana photos, Ram charan, Upasana, vinaya vidheya rama, location, fish curry, boyapati srinu, tollywood, movies, entertainment

Mega power star Ram charan wife Upasana Konidela shared one of her husband’s secret behind that macho look that we have got to see in the poster and trailer of ‘Vinaya Vidjeya Rama’ (VVR).

రాంచరణ్ లోకేషన్లో చేపలకూర వండిన ఉపాసన

Posted: 01/03/2019 07:31 PM IST
Upasana konidela prepares fish curry on vvr location from ram charan diet

తన భర్త, హీరో రాంచరణ్ కు సంబంధించిన విషయాలలో ఆయన సతీమణి ఉపాసన ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా విడుదలకు సిద్దమైన వినయ విధేయ రామ చిత్రంలో ఆయన డైట్ విషయంలో అమె తూచ తప్పకుండా దాన్ని పాటించడంతో పాటు సమయానికి వేడివేడిగా దాన్ని అందించారు. అందుకోసం అమె కూడా ఎంతో ప్రయాసపడ్డారు. తన భర్తతో పాటు భర్త సినిమాలకు, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను అమె సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం తెలిసిందే.

తాజాగా, 'వినయ విధేయ రామ' సినిమా లొకేషన్లో చరణ్ కోసం ఆమె పడిన కష్టాన్ని కూడా వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఉపాసన. ఈ సినిమా లోకేషన్లో.. మిస్టర్ సి డైట్ ప్రకారం అమె చేప ఫ్రై తయారు చేశారు. లవణాన్ని వాడకుండా... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఆమె ఈ డిష్ ను తయారు చేశారు. ఈ వంటకం తయారీలో ఉపాసనకు చరణ్ కూడా సాయం అందించాడు. ఆ తర్వాత ఫిష్ కు తోడుగా బంగాళాదుంప, వెల్లుల్లిలను ఆమె జత చేశారు. మరో విషయం ఏమిటంటే పక్కనున్న కాలువ నుంచి చరణ్ అసిస్టెంట్ ఈ చేపను పట్టుకొచ్చాడు. ఉపాసన ఈ డిష్ ను ఎలా తయారు చేసిందో మీరూ చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Upasana  vinaya vidheya rama  location  fish curry  boyapati srinu  tollywood  

Other Articles