rajinikanth petta official telugu trailer released అదరగొడుతున్న రజనీ ‘పేట’ తెలుగు ట్రైలర్

Superstar rajinikanth s film petta s telugu trailer released

Rajinikanth, super star Rajinikanth, petta trailer, Petta telugu trailer, petta release date, petta, Karthik Subbaraj, simran, trisha, movies, entertainment, tollywood

The Telugu trailer of Rajinikanth's Petta is out and it has touched one lakh views in just an hour of its release. Directed by Karthik Subbaraj, the film will release on January 10 this year.

అదరగొడుతున్న రజనీ ‘పేట’ తెలుగు ట్రైలర్

Posted: 01/02/2019 09:20 PM IST
Superstar rajinikanth s film petta s telugu trailer released

‘చూస్తావుగా ఈ కాలీ ఆడించే ఆట’ అంటూ ‘పేటా’ ట్రైలర్‌తో దమ్ము చూపిస్తున్నాడు రజినీకాంత్. సంక్రాంతి కానుకుగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘పేటా’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. ఇటీవల తమిళ్‌లో ఈ ట్రైలర్‌ను విడుదలై యూట్యూబ్‌ని షేక్ చేయగా తెలుగులోనూ విడుదల చేశారు.

‘20 మందిని పంపించాను అందర్నీ చితక్కొట్టి తరిమాడు’.. అంటూ రజినీకాంత్‌ను రివీల్ చేస్తూ మొదలైన ఈ ట్రైలర్‌లో తలైవా స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్నాడు. ‘వాడు కూర్చునే తీరును బట్టే పసిగట్టగలం.. వాడు భయపడేవాడా? కాదా? అని.. వాడు మామూలోడు కాదు’ అంటూ రజినీ హీరోయిజాన్ని ఎలివేట్ అయ్యేలా డైలాగ్‌లు ఉన్నాయి. ‘చూడ్డానికి చిన్న పిల్లాడిలా చాలా స్టైల్‌గా ఉన్నారు’ అనే డైలాగ్‌కి.. స్టైల్‌గా ఉన్నానట నేచురల్లీ అంటూ తనదైన శైలిలో రజినీకాంత్ స్టైలిష్‌గా చెప్పడం ఆసక్తికరంగా ఉంది.

‘ఏయ్.. ఎవడికైనా పెళ్లం పిల్లలు అంటూ సెంటిమెంట్లు గింటుమెంట్లు ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి.. మండి పోతిందిక్కడ దొరికారా భస్మమే’ అంటూ రజినీ సీరియస్ వార్నింగ్‌తో పాటు.. ‘నిజంగా చెబుతున్నాను.. కొట్టి అండర్‌వేర్‌తో పరుగెత్తిస్తాను.. పరువు పోతే తిరిగి రాదు చూస్కో’ లాంటి స్వీట్ వార్నింగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇక చివర్లో సాంప్రదాయ వస్త్రాల్లో మాస్ స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నాడు రజినీ.

ఓవరాల్‌గా మాస్ అండ్ స్టైలిష్ అవతారాల్లో చాలా యంగ్‌గా కనిపిస్తూ సందడి చేస్తున్నారు తలైవా. రజినీ, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటనతో పాటు.. సుబ్బరాజు మేకింగ్ స్టైయిల్, అనిరుధ్ మ్యూజిక్, తిరునఉక్కారుసు సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ యాక్షన్స్ ఎపిసోడ్స్.. ట్రైలర్‌కు హెల్ప్ అయ్యాయి. కేవలం గంట వ్యవధిలోనే సుమారుగా లక్ష వ్యూవ్స్ ఈ ట్రైలర్ కు లభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  petta trailer  Petta telugu trailer  Karthik Subbaraj  simran  trisha  tollywood  

Other Articles

  • Karthi rashmika mandanna new movie starts with a pooja

    కార్తీతో కలసి పూజా కార్యక్రమానికి రష్మిక

    Mar 13 | 'ఛలో, గీత గోవిందం' లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక మందన తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేసింది. కార్తీ హీరోగా చేస్తోన్న కొత్త సినిమాలో రష్మిక... Read more

  • Sai dharam tej and kalyani priyadarshan starrer looks fun and exciting

    ప్రేక్షకులను అకట్టుకుంటున్న సాయిధరమ్ తేజ్ చిత్రలహరి టీజర్

    Mar 13 | మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువనటుడు సాయిధరమ్ తేజ్ తన అశలన్నీ తన తదుపరి చిత్రం చిత్రలహరిపైనే పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ఆయన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేయకపోవడంతో.. ఈ చిత్రమైనా మంచి... Read more

  • Lakshmi s veera grandham movie official trailer

    లక్ష్మీస్ వీరగ్రంధం టీజర్ విడుదల

    Mar 13 | ఎన్నికలవేళ దివంగత ఎన్‌టీఆర్ మీద సినిమాలు చేస్తూ ఎవరికి అనుకూలంగా వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా విడుదలకు సిద్ధం అవగా.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం అనే... Read more

  • Mahesh babu kids gautham and sitara enjoying holidays on maharshi sets

    ‘మహర్షి’ సెట్స్ లో ముగ్గురు చిన్నారి అతిధులు..

    Mar 13 | వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహేష్ 25వ... Read more

  • Ec urged to stop lakshmi s ntr till andhra elections

    ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు బ్రేక్.?

    Mar 12 | సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో తన సినిమాల కన్నా.. తన సామాజిక మాద్యమంలో వివాదాస్పద పోస్టులు, వ్యాఖ్యలతోనే అధికంగా ప్రేక్షకుల నోటిలో నానుతూవున్నారు. ఇక తాజాగా ఆర్జీవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న'లక్ష్మీస్‌... Read more

Today on Telugu Wishesh