Tarak is an all-rounder: sumanth తారక్ ను ముద్దుగా సుమంత్ ఇలానే పిలుస్తాడు.!

Why actor sumanth calls junior ntr as bawa

Tarak is the best after Mahesh: Sumanth, Jr NTR, Mahesh Babu, Sumanth, Subhramanya Puram, Subhramanya Puram updates, , movies, entertainment, tollywood

Sumanth has said that NTR is his most favourite actor among his generation's stars after Mahesh Babu. "Tarak is an all-rounder. He dances well, acts well," Sumanth says.

జూనియర్ ఎన్టీఆర్ ను సుమంత్ ఏమని పిలుస్తాడో తెలుసా.?

Posted: 12/01/2018 06:18 PM IST
Why actor sumanth calls junior ntr as bawa

సుమంత్ కథానాయకుడిగా 'సుబ్రహ్మణ్యపురం' సినిమా రూపొందింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో సుమంత్ బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర, ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నాడు.

ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్ గురించిన ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు సుమంత్ తనదైన శైలిలో స్పందిస్తూ .. 'తారక్ తో నాకు ఎంతో సాన్నిహిత్యం వుంది. నేను ముద్దుగా ఆయనని 'బావా' అని పిలుస్తుంటాను. ఎలాంటి పాత్రను ఇచ్చినా తారక్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ఆయన చేయలేని పాత్రంటూ ఉండదు' అంటూ సమాధానమిచ్చాడు. ఇక ఎన్టీఆర్ తరువాత తనకు నచ్చింది మహేష్ బాబు అని చెప్పాడు సుమంత్.

కాగా, ఈ సినిమాలో అక్కడక్కడా వాయిస్ ఓవర్ ఉందట. సన్నివేశాలను కలుపుతూ సాగే వాయిస్ ఓవర్ ను ఎవరితో చెప్పించాలా అనే విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. అప్పుడు రానాతో చెప్పిస్తే బాగుంటుందని సుమంత్ సూచించడంతో, ఆయన ద్వారానే రానాను సంప్రదించడం జరిగిందట. సుమంత్ కోసం రానా చెప్పిన వాయిస్ ఓవర్ కథలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumanth  Jr NTR  Mahesh Babu  Subhramanya Puram  tollywood  

Other Articles