Interesting update about RRR రాజమౌళి మల్టీస్టారర్: రాంచరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఇవేనా.?

Interesting update about rajamouli multistarer

Ram charan role in rrr, Jr, NTR role in rrr, SS Rajamouli, rrr update, RRR, Ram charan, Jr NTR, Dvv Danayya, MM Keeravani, movies, entertainment, tollywood

Maverick director SS Rajamouli has finally launched the Tollywood biggest multi starrer movie ‘RRR’ with Mega power Star Ram Charan and Young Tiger NTR. The expectations on this movie are extremely high.

రాజమౌళి మల్టీస్టారర్: రాంచరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఇవేనా.?

Posted: 11/26/2018 09:29 PM IST
Interesting update about rajamouli multistarer

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం అప్ డేట్స్ కు సంబంధించి టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘RRR’ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ తెలుగునాట దీనిపైనే చర్చ. అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానుల ఫాలోయింగ్ తో ఈ చిత్రం షూటింగ్ నుంచే ప్రతీ విషయాన్ని మిస్ కాకూదని అభిమానులు తెగ ఫాలో అవుతున్నారు.

అయితే రాజమౌళి సినిమాను ప్రకటించి షూటింగ్‌ ప్రారంభించేశారు కానీ.. అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి? ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? వంటి విషయాలపై ఒక్క లీకు కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాపై బోలెడన్ని ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ సినిమాలో తమ అభిమాన నటుడు ఏ పాత్ర పోషిస్తున్నాడన్న అసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది.

సినిమా ప్రారంభానికి ముందే ‘RRR’పై బోలెడన్ని రూమర్లు వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారని.. ఇద్దరూ బాక్సర్లని వార్తలు వచ్చాయి. ఆ తరవాత చరణ్ పాజిటివ్ రోల్, ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషిస్తు్న్నారని అన్నారు. ఇప్పుడు ఈ సినిమా కథకు సంబంధించి మరో అంశంపై తెరపైకి వచ్చింది. ఈ సినిమా దొంగా పోలీస్ నేపథ్యంలో ఉండనుందని అంటున్నారు. బందిపోటు దొంగగా ఎన్టీఆర్ నటిస్తుంటే, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చరణ్ కనిపిస్తారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాకుండా విజయేంద్ర ప్రసాద్ 1920 నాటి కథాంశాన్ని తీసుకున్నారని టాక్.

మరి వీటిలో ఏది నిజమో తెలీదు కానీ, రూమర్లయితే మాత్రం కోకొల్లలుగా వస్తున్నాయి. ఇవి నిజం కాకపోయినా వినడానికి, చెప్పుకోడానికి బాగుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కథ విషయం ఎలా ఉన్నా సినిమాను అయితే మాత్రం రాజమౌళి భారీ స్థాయిలో తెరెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన సెట్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SS Rajamouli  rrr update  RRR  Ram charan  Jr NTR  Dvv Danayya  MM Keeravani  tollywood  

Other Articles