Taxiwala Day 3 Collections కలెక్షన్ల వసూళ్లతో దూసుకెళ్తున్న ‘టాక్సీవాలా’..

Vijay devarakonda taxiwala 3rd day collections at box office

Vijay Deverakonda, Taxiwala, Geetha Arts 2, UV Creation, Tollywood Box Office Collections 2018, Taxiwala Collections, Tollywood, Box Office Collections, tollywood, movies, entertainment

Taxiwala movie is apparently creating quite a sensation in the industry with the collections. The movie has been collecting decent numbers at the box office now.

కలెక్షన్లతో దూసుకెళ్తున్న ‘టాక్సీవాలా’..

Posted: 11/20/2018 08:50 PM IST
Vijay devarakonda taxiwala 3rd day collections at box office

స్టార్ దర్శకులు, క్రేజీ హీరోయిన్లు, భారీ బడ్జెట్.. సినిమా హిట్ అవ్వాలంటే ఇవి కాదు ప్రాథమిక సూత్రాలు కథలో కంటెంట్ ఎంత అన్నదే విజయ దేవరకొండ విజయ రహస్యం. దీంతో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందుకుని తాజాగా కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్, కొత్త నిర్మాత, కొత్త కమెడియన్‌తో ‘టాక్సీవాలా’ అనే ప్రయోగాత్మక కథతో విజయదుందభి మోగించాడు విజయ్ దేవకొండ.

శనివారం విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తొలిరోజే పెట్టుబడి మొత్తాన్ని రాబట్టి లాభాల బాట పట్టిన ‘టాక్సీవాలా’ వీకెండ్‌లో మరింత పుంజుకుని పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని నిరూపించింది. హైఫై సూపర్ న్యాచ‌ర‌ల్ థ్రిల్ల‌ర్‌ కథతో కొత్త దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ తొలి చిత్రంలోనే ప్రయోగం చేసి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నారు. ‘ఆస్ట్రల్ ప్రొజెక్షన్’ అనే సైంటిఫిక్ థియరీతో శరీరం, ఆత్మల నేపథ్యంలో ఇంట్రస్టింగ్ కథను సరికొత్త కథనంతో ప్రజెంట్ చేసి విజయ్ దేవరకొండకు మరో హిట్ ఇచ్చాడు. కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంతో తొలిరోజే మంచి కలెక్షన్లను రాబట్టిన ‘టాక్సీవాలా’ మూడో రోజు నాటికి మరింత పుంజుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 10. 5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ. 17 కోట్లు.. మూడో రోజు నాటికి రూ. 22 కోట్ల వరకూ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు కర్నాటక రాష్ట్రంలో కూడా ‘టాక్సీవాలా’ భారీ కలెక్షన్లు రాబట్టింది. వీకెండ్‌లో రూ. 1.49 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు కలెక్షన్ల వివరాలపై అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా ప్రాంతాల వారీగా లెక్కలను మాత్రం ట్రేడ్ అనలిస్టులు అంచాలు ఇలా వున్నాయి.

ప్రాంతాలవారీగా కలెక్షన్లు:-

నిజాం రూ 3.79 కోట్లు
నెల్లూరు రూ 24.9 లక్షలు
గుంటూరు రూ 63.91 లక్షలు
కృష్ణ రు. 62.7 లక్షలు
వెస్ట్ రూ 44 లక్షలు
ఈస్ట్ రూ 48.10 లక్షలు
ఉత్తరాంధ్ర రూ. 95 లక్షలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles